మంగళవారం, 18 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

50శాతం నేరుగా డిఇవోల నియామకం

07 ఆగస్టు, 2026

ap govt
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 07, 2026, 11:21 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- ఎడ్యుకేషన్‌ సర్వీస్‌ రూల్స్‌ సవరించిన ప్రభుత్వం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : జిల్లా విద్యాశాఖ అధికారి(డిఇవో) పోస్టులను 50శాతం నేరుగా రాష్ట్రప్రభుత్వం డైరెక్ట్‌‌గా నియామకం చేపట్టనుంది. గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఎపి ఎడ్యుకేషన్‌ ‌సర్వీస్‌ ‌రూల్స్‌-1998ను సవరిస్తూ పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్‌ ‌శుక్రవారం జివో 19ను విడుదల చేశారు. ఇప్పటి వరకు పదొన్నతుల ద్వారా డిఇవోల నియామకం జరుగుతోంది. డిప్యూటీ డిఇవో, బిఇడి అర్హతతో పాఠశాల విద్యలో పనిచేస్తున్న అసిస్టెంట్‌ ‌డైరెక్టర్లు, డైట్‌ ‌కళాశాలల్లో సీనియర్‌ ‌లెక్చరర్లు, ఎస్‌‌సిఇఆర్‌‌టిలో పనిచేస్తున్న లెక్చరర్లు పదోన్నతి ద్వారా డిఇవోగా పనిచేసేఅవకాశం లభిస్తోంది. ఇప్పుడు 50శాతం పోస్టులను నేరుగా నియామకం చేసేలా నిబంధన తీసుకొచ్చింది. డైరెక్ట్‌ ‌రిక్రూట్‌‌మెంట్‌ ‌ద్వారా నియామకమయ్యే అభ్యర్ధులు డిగ్రీలో బిఇడి కోర్సు చేయడంతో పాటు పిజి కలిగిన అభ్యర్ధులు అర్హులని పేర్కొంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్