గురువారం, 30 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఇ20తో ఇంధన సామర్థ్యం 6 శాతం తగ్గుదల : నితిన్‌ గడ్కరీ

1 గంట క్రితం

Nitin Gadkari
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 30, 2026, 11:21 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : ఇ20 పెట్రోల్‌‌తో వాహన ఇంధన సామర్థ్యం ఆరు శాతం వరకూ తగ్గుతుందని కేంద్రం ప్రభుత్వం నిర్వహించిన ఒక అధ్యయనంలో వెల్లడైందని పార్లమెంట్‌‌లో ప్రభుత్వం వెల్లడించింది. ఈ అధ్యయనం ప్రకారం వాహన కేటగిరి, తయారీ సంవత్సరాన్ని బట్టి వాహనాల ఇంధన సామర్థ్యం 2 నుండి 6 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరి లోక్‌సభకు గురువారం తెలిపారు. డైనమోమీటర్‌, ఆన్‌ ‌రోడ్‌ ‌వెహికల్‌ ‌పరీక్షల్లో ఇ20 పెట్రోల్‌‌తో ఇంజిన్‌ ‌మన్నిక విషయంలో ఎటువంటి వైఫల్యాలు కనబడలేదని అన్నారు. లోక్‌‌సభ సభ్యులు, అడ్వకేట్ చంద్రశేఖర్ అడిగిన ప్రశ్నలకు మంత్రి ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ అంశాలను తెలిపారు. ఇ10తో పోలిస్తే ఇ20 పెట్రోల్‌‌ ఉత్తమ ఆక్సిలరేషన్‌, మెరుగైన రైడ్‌ ‌క్వాలిటీ, దాదాపు 30 శాతం తక్కువగా కర్బన ఉద్గరాలు విడుదల చేస్తాయని మంత్రి తన సమాధానంలో పేర్కొన్నారు. బిఎస్‌ 3, బిఎస్‌ 4, బిఎస్‌ 4 ఇ10 (గ్యాసోలిన్)లకు చెందిన ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాలపై ఇ20 ప్రభావాన్ని గుర్తించడానికి కేంద్ర ప్రభుత్వం నేతృత్వంలోని ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్‌ ఇండియా (ఎఆర్‌ఎఐ), సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (ఎస్‌ఐఎఎం), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసిఎల్‌) సంయుక్తంగా ఈ అధ్యయనం నిర్వహించాయి. కొన్ని రోజుల క్రితం పార్లమెంట్‌‌లో మంత్రి గడ్కరీ మాట్లాడుతూ ఇ20 పెట్రోల్‌‌తో ఎలాంటి సమస్యలు ఉండవని, 2016 ముందు తయారైన బిఎస్‌ 3 వాహనాల్లో కొన్ని రబ్బరు భాగాలు, గాస్కెట్లను మాత్రమే మార్చవలసి రావచ్చునని తెలపగా, ఇప్పుడు అందుకు భిన్నంగా వివరణ ఇవ్వడం గమనార్హం.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్