గురువారం, 30 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionనేడు పిడుగులతో కూడిన వర్షాలు..

-187 నిమిషాల క్రితం

Southwest monsoon set to revive across the country
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 31, 2026, 04:45 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • విపత్తుల నిర్వహణ సంస్థ

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వచ్చే 24 గంటల్లో విదర్భ, దక్షిణ మధ్యప్రదేశ్ మీదుగా పశ్చిమ-వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీని ప్రభావంతో శుక్రవారంనాడు పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, బి.ఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని సంస్థ మేనేజింగ్‌ ‌డైరెక్టర్‌ ‌ప్రఖర్‌‌జైన్‌ ‌గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు వీచే సమయంలో చెట్లు, హోర్డింగ్స్, విద్యుత్ స్తంభాల కింద నిలబడకూడదని సూచించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్