శుక్రవారం, 03 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

6 శాతం ఆర్డీఎఫ్ వినియోగించాలి

1 గంట క్రితం

kommareddy pattabhiram
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 03, 2026, 08:19 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- ఆంధ్ర కార్పోరేషన్ చైర్మన్ పట్టాభిరామ్

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : స్వచ్ఛ భారత్ మిషన్ తాజా నిబంధనల ప్రకారం సిమెంట్ కంపెనీలు తమ ఇంధన అవసరాల్లో కొంత భాగాన్ని రాష్ట్రంలో త్వరలో ప్రారంభమయ్యే ఫ్రెష్ వేస్ట్ ప్రాసెసింగ్ కేంద్రాలు, ప్రస్తుత బయోమైనింగ్ లెగసీ వేస్ట్ ద్వారా వచ్చే రిఫ్యూజ్ డిరైవ్డ్ ఫ్యూయల్ (ఆర్డీఎఫ్)ను తప్పనిసరిగా వినియోగించాలని స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ చెప్పారు. గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన సిమెంట్ కంపెనీల ప్రతినిధులతో విజయవాడ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కార్యాలయంలో శుక్రవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సిమెంట్ కంపెనీల వారు లెగసీ వేస్ట్, ఫ్రెష్ వేస్ట్ ప్రాసెసింగ్ కేంద్రాలలో తయారయ్యే ఆర్డీఎఫ్ లో ఆరు శాతం తప్పనిసరిగా వినియోగించాలని సూచించారు. ప్రతి కంపెనీ ఎస్‌బీఎం నిబంధనలను తప్పక పాటించాలని కోరారు. సిమెంట్ కంపెనీ యాజమాన్యాలు ఆర్డీఎఫ్ వినియోగంపై ఖచ్చితమైన టైమ్ లైన్ అందజేయాలని కోరారు. సిమెంట్ కంపెనీలు ఆర్డీఎఫ్ వాడకానికి తగిన యంత్రాలను రిట్రోఫిటింగ్ త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఏ కంపెనీ ఎంత ఆర్డీఎఫ్ వినియోగిస్తున్నారో స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటాయన్నారు. ఇందు కోసం ప్రత్యేకంగా ఒక పర్యవేక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎస్‌బీఎం నిబంధనల ప్రకారం ఆర్డీఎఫ్ వినియోగించని కంపెనీలపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ చైర్మన్ పట్టాభిరామ్, ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ డాక్టర్ పి.కృష్ణయ్య చెప్పారు. ఈ సమావేశంలో స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ ఎండి బి.అనిల్ కుమార్ రెడ్డి, పిసిబి సభ్యులు ఆర్. శర్వణ, చీఫ్ ఎన్విరాన్ మెంటల్ ఇంజనీర్ ఎం.రాజశేఖర్, మూడు జిల్లాల సిమెంట్ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.


సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్