‘విసా– వింటారా సరదాగా’ చిత్ర బృందం రెండో గీతం ‘చింగారి’ని విడుదల చేసింది. విజయ్ బుల్గానిన్ స్వరపరిచిన ఈ పాటను సిద్ శ్రీరామ్, లిప్సిక ఆలపించారు. సనారే రచించిన ఈ పాట ప్రేమలోని నిశ్శబ్ద వేదన, భావోద్వేగాలను ఆవిష్కరిస్తుందని చిత్ర యూనిట్ తెలిపింది. తొలి గీతం ‘అనగనగా అమెరికా’కు మంచి స్పందన లభించింది. సొంత ఊరిని వదిలి విదేశాల్లో కలలను సాకారం చేసుకునేందుకు ప్రయత్నించే యువత భావోద్వేగాల నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఉద్భవ్ రఘు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అశోక్ గల్లా, శ్రీ గౌరీ ప్రియ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్, సత్య, వైవా హర్ష, గుండు సుదర్శన్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.
‘విసా– వింటారా సరదాగా’లో రెండోపాట విడుదల
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 03, 2026, 09:21 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)