కోటి మొక్కల రామయ్యగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన పర్యావరణ ఉద్యమకారుడు, పద్మశ్రీ గ్రహీత వనజీవి దరిపల్లి రామయ్య సేవలను గుర్తుచేస్తూ రూపొందించిన లఘుచిత్రం ‘వనజీవి రామయ్య’. ఈ చిత్ర బృందం, వాస్విక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వనజీవి అవార్డు పురస్కార మహోత్సవాన్ని నిర్వహించింది. వనజీవి రామయ్య జయంతిని పురస్కరించుకుని ప్రసాద్ ల్యాబ్‌లో జరిగిన కార్యక్రమంలో పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న స్వచ్ఛంద సేవకులను సత్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణలోని పల్లె ప్రకృతి వనాలకు వనజీవి రామయ్య పేరు పెట్టాలని ప్రభుత్వాన్ని కోరుతూ, ఆయన జీవితకథ ఆధారంగా పాన్ ఇండియా ఫీచర్ ఫిల్మ్‌ను రూపొందిస్తున్నట్లు నిర్మాత నిడిగొండ నరేష్ ప్రజాపతి తెలిపారు. దర్శకుడు వేముగంటి మాట్లాడుతూ, వనజీవి రామయ్య సేవలు, జీవన తత్వాన్ని భావితరాలకు చేరవేసే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు చెప్పారు. కార్యక్రమంలో నూకల నర్సింహారెడ్డి, మల్లిక్ తేజ, వెంకట అప్పారావు, విశ్వనాథ్, వినయ్ రెడ్డి, మహేంద్ర వర్మ, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
పర్యావరణ పరిరక్షణ కోసం...
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 03, 2026, 09:31 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)