ఆయుష్మాన్ ఖురానా హీరోగా యశ్ రాజ్ ఫిల్మ్స్, పోషమ్ పా పిక్చర్స్ బ్యానర్లపై రూపొందుతున్న చిత్రం ‘ముపాపా’. యశ్ రాజ్ ఫిల్మ్స్ సీఈఓ అక్షయ్ విదాని ఈ మూవీని నిర్మిస్తున్నారు. షోరన్నర్, దర్శకుడు సమీర్ సక్సేనా దర్శకత్వం వహిస్తున్నారు. ఈయన నిర్మించిన గత చిత్రం ‘సయారా’ విజయాన్ని అందుకుంది. ‘ముపాపా’ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 19న విడుదల కానున్నట్లు నిర్మాతలు తెలిపారు. ‘కాలా పానీ’, ‘మామ్లా లీగల్ హై’ వంటి ప్రేక్షకాదరణ పొందిన చిత్రాల్లో భాగమైన పోషమ్ పా పిక్చర్స్ పార్ట్‌నర్స్ సమీర్ సక్సేనా, బిస్వపతి సర్కార్, సౌరభ్ ఖన్నా, అమిత్ గోలాని ఇందులోనూ భాగమయ్యారు.
ఫిబ్రవరి 19న 'ముపాపా` విడుదల
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 03, 2026, 10:06 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)