సోమవారం, 24 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

రెండో రోజు ఎఇఇ పరీక్షకు 6441 మంది హాజరు

1 గంట క్రితం

aee
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 24, 2026, 10:36 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : విద్యుత్‌ ‌సంస్థల్లో విడుదల చేసిన అసిస్టెంట్‌ ఎగ్జీక్యూటీవ్‌ ఇంజనీర్‌(ఎఇఇ) పోస్టుల భర్తీ పరీక్ష రెండోరోజూ ప్రశాంతంగా జరిగింది. మెకానికల్‌ ఇంజనీరింగ్‌ ‌పరీక్షకు 9444 మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోగా వీరిలో 6441(67.88శాతం) మంది సోమవారం పరీక్షకు హాజరయ్యారని ట్రాన్స్‌‌కో జెఎండి సూర్యసాయి ప్రవీణ్‌‌చంద్‌ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలోనే కాకుండా పొరుగు రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాల్లో కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ చోటుచేసుకోలేదని పేర్కొన్నారు. విజయవాడలోని విద్యుత్‌ ‌సౌధ కమాండ్‌ ‌కంట్రోల్‌ ‌సెంటర్‌ ‌నుంచి పరీక్షా హాళ్లు, కారిడార్లు, సర్వర్‌ ‌రూమ్‌‌ల పర్యవేక్షణను సిసి టీవిల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తునట్లు తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే పుకార్లు, తప్పుడు ప్రచారాలను అభ్యర్ధులు నమ్మి మోసపోవద్దని, కేవలం అధికారిక రిక్రూట్‌‌మెంట్‌ ‌పోర్టల్ సమాచారాన్నే ప్రామాణికంగా తీసుకోవాలని హెచ్చరించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్