ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: హస్త కళారూపాల తయారీలో మరింత ప్రావీణ్యం పెంపొందించడంతో పాటు ఆధునిక డిజైన్ల తయారీలో శిక్షణా కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం రూ.1.35 కోట్లను కేటాయించిందని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కళారూపాలను తయారు చేస్తున్న 770 మంది హస్త కళాకారులకు శిక్షణా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు శుక్రవారం ఒక ప్రకటనలో ఆమె పేర్కొన్నారు. ఆయా కళారూపాలను బట్టి శిక్షణ నెల రోజుల నుంచి రెండు నెలల పాటు ఇవ్వనున్నారని తెలిపారు. హస్త కళాకారులకు కూడా ఆర్థిక భరోసా కలిగేలా ఆయా కళారూపాల తయారీలో మెరుగైన శిక్షణ ఇవ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా తీసుకుంటోందన్నారు. జిల్లాల్లో ప్రఖ్యాతిగాంచిన హస్త కళారూపాలను తయారీ చేస్తున్న కళాకారులను గుర్తించి మారుతున్న అభిరుచులకు అనుగుణంగా శిక్షణ ఇస్తామన్నారు. శిక్షణ కార్యక్రమాలకు మొదటి విడతగా రూ.1.01 కోటి నిధులు మంజూరయ్యాయన్నారు. రాష్ట్రంలో ఆయా క్లస్టర్లలో ఉన్న హస్త కళాకారులకు రెండు విధాలుగా శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. గురు-శిష్యహస్త శిల్ప్ ప్రశిక్షణ్, డిజైన్ డెవలప్‌మెంట్ వర్క్‌షాప్స్ ద్వారా శిక్షణ ఇవ్వనున్నామన్నారు. గురు-శిష్య హస్త శిల్ప్ ప్రశిక్షణ్ రెండు నెలలు, డిజైన్ డెవలప్‌మెంట్ వర్క్‌షాప్స్ నెల రోజుల పాటు శిక్షణ అందజేయనున్నట్లు తెలిపారు.
కళారూపాల తయారీలో 770 మంది కళాకారులకు శిక్షణ: మంత్రి సవిత
1 రోజు క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 05, 2026, 12:30 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)