ఆదివారం, 13 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎస్‌ఐఆర్‌ నోటీసుల విచారణలో 84 శాతం

6 రోజుల క్రితం

sir
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 06, 2026, 11:26 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్‌) కార్యక్రమంలో నోటీసుల విచారణ ఆదివారానికి 84 శాతంగా నమోదైంది.44.28 లక్షల మందికి నోటీసులు జారీ చేయగా నోటీసులు అందుకున్న వారిలో ఇప్పటివరకు 37.02 లక్షల మందికి విచారణ పూర్తైంది. జిల్లాల వారీగా నోటీసుల విచారణలో కర్నూలు, అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి, చిత్తూరు, శ్రీకాకుళం, నంద్యాల జిల్లాలు మెరుగైన పనితీరు కనబరుస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో విచారణ ప్రక్రియ వేగం పుంజుకోవాల్సి ఉంది. పల్నాడు జిల్లాలో 27.83 శాతం, ప్రకాశంలో 26.71 శాతం, తిరుపతిలో 26 శాతం మేరకే విచారణ పూర్తవడంతో ఈ జిల్లాలు వెనుకబడి ఉన్నాయి. 44.28 లక్షలకు పైగా నోటీసులు పంపిణీ అయ్యాయి. కేవలం 177 నోటీసులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. క్లెయిములు, అభ్యంతరాల పరిష్కారంలో భాగంగా ఫారం-6( కొత్త ఓటు నమోదు)కింద 2.52 లక్షల దరఖాస్తులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. ఫారం-7( ఓటు తొలగింపు)కింద 7,646, ఫారం-8 (సవరణ)కింద 1.52 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. బిఎల్‌ఒతో కాల్ బుక్ చేసుకునేందుకు సంబంధించిన 321 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్