సోమవారం, 24 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

పోలీసు వేధింపులపై సమగ్ర విచారణ జరపాలి

1 రోజు క్రితం

police
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 22, 2026, 10:02 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొల్లాటి శ్రీనివాసరావు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పోలీసుల వేధింపులు భరించలేక పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న కృత్తివెన్ను మండలం గరిసిపూడి పంచాయతీ దోమలగొంది గ్రామానికి చెందిన తిరుమల శెట్టి కనకరాజుకు మెరుగైన వైద్యం అందించి ప్రాణాలను కాపాడాలని రాష్ట్ర మత్స్యకారులు, మత్స్య కార్మిక సంఘం (సిఐటియు) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు శనివారం ఒక ప్రకటనలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొల్లాటి శ్రీనివాసరావు తెలిపారు.బొలెరో వాహనంతో జీవనం సాగిస్తున్న కనకరాజు కొన్ని రోజుల క్రితం బంటుమిల్లి పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా హారన్ కొట్టినందుకు వాహనాన్ని నిలిపి స్టేషన్‌కు తీసుకెళ్లారని తెలిపారు. అనంతరం సెల్‌ఫోన్ తీసుకుని మూడు రోజుల పాటు స్టేషన్ చుట్టూ తిప్పడం, ఎస్సై, సిబ్బంది దాడి చేసి, అసభ్య పదజాలంతో దూషించి వేధించారని బాధితుడు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నట్లు పేర్కొన్నారు. పోలీసుల వద్ద వాహనం ఉండటంతో కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. తీవ్ర మనోవేదనకు గురైన కనకరాజు పోలీస్‌స్టేషన్ ఎదుటే పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారని పేర్కొన్నారు. తీవ్రంగా గాయపడిన ఆయనను విజయవాడలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు.కనకరాజుకు అత్యుత్తమ వైద్యం అందించి, వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరించి, కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. ఘటనపై నిష్పక్షపాతంగా సమగ్ర విచారణ జరిపి, ఆరోపణలు నిజమైతే బంటుమిల్లి ఎస్‌ఐ, సంబంధిత సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. జీవనోపాధికి ఆధారమైన బొలెరోను వెంటనే అప్పగించాలని కోరారు. పోలీస్‌స్టేషన్లలో వేధింపులు, అక్రమ నిర్బంధాలను అరికట్టి ‘ఫ్రెండ్లీ పోలీసింగ్‌’ను ఆచరణలో అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్