బుధవారం, 05 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ఏసీబీకి చిక్కిన డీఆర్వో పునర్నియామకం

2 గంటల క్రితం

acb
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 05, 2026, 09:03 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- సస్పెన్షన్ ఎత్తివేసిన ప్రభుత్వం

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : పల్నాడు జిల్లా రెవెన్యూ అధికారిగా నరసరావుపేటలో పని చేస్తున్న కాలంలో ఏసీబీ దాడిలో పట్టుబడిన ఏకా మురళిపై సస్పెన్షన్ ఎత్తివేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది జనవరి 24న లంచం డిమాండ్ చేసి తీసుకున్న ఆరోపణలతో ఏసీబీ ఆయనపై కేసు నమోదు చేసింది. ఆయనను అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్ తరలించడంతో ప్రభుత్వం సస్పెండ్ చేసింది. సస్పెండ్ అయిన అధికారులపై ఉన్న కేసులను జులై 22న సమీక్షించిన కమిటీ ఏకా మురళిని విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తూ ఆయన సస్పెన్షన్ రద్దు చేసి పునర్నియామకం చేసింది. ఆయనపై కొనసాగుతున్న క్రిమినల్, శాఖాపరమైన విచారణకు ఎలాంటి ఆటంకం కాబోదని స్పష్టం చేసింది. ఆయనను సుదూర ప్రాంతాల్లో అప్రాధాన్య పోస్టుల్లో నియమించాలని ప్రభుత్వం ఆదేశించింది. తదుపరి పోస్టింగ్ కోసం సాధారణ పరిపాలన విభాగం ఎదుట హాజరుకావాలని తెలిపింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్