ఆదివారం, 30 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

విశాఖ ఆర్కే బీచ్‌లో తప్పిన ప్రమాదం

1 గంట క్రితం

vizag.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 30, 2026, 04:51 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-విశాఖ : విశాఖ ఆర్కే బీచ్‌లో ప్రమాదం తప్పింది. సముద్ర స్నానానికి వెళ్లిన ఓ వ్యక్తి కెరటాల్లో దాటికి నీళ్లలో కొట్టుకుపోయారు. అయితే మెరైన్ పోలీసులు, లైఫ్ గార్డ్స్ సకాలంలో స్పందించి ఆ వ్యక్తిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.  నగరంలోని రెల్లి వీధికి చెందిన చిన్న ఈశ్వరరావు (56)... ఆర్కే బీచ్‌లో స్నానానికి దిగాడు. అయితే, అక్కడ ఈత నిషేధమని లైఫ్ గార్డ్స్ ఎంతగా వారించినా ఆ హెచ్చరికలను పెడచెవిన పెట్టాడు. కొద్దిసేపటికే సముద్రంలో ఉద్ధృత కెరటాల మధ్యలో చిక్కుకుపోయాడు. ఉవ్వెత్తున ఎగసిపడిన అలల తాకిడికి నీటిలో మునిగిపోతూ ఆర్తనాదాలు చేశాడు. అక్కడే ఉన్న బీచ్ లైఫ్ గార్డ్ ధనరాజు... ఈదుకుంటూ వెళ్లి మృత్యువుతో పోరాడుతున్న ఈశ్వరరావును సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చాడు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్