సంగారెడ్డి జిల్లా : నిజాంపేట్ మండలం బాచుపల్లి వద్ద మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారి 161పై ఎదురుగా వస్తున్న బైక్‌ను తప్పించబోయి ప్రమాదవశాత్తూ స్కార్పియో వాహనం బోల్తాపడి ముగ్గురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో వాహనంలో ప్రయాణిస్తున్న ఓ కుటుంబం మొత్తం ప్రాణాలు కోల్పోయింది. మృతుల్లో భార్యాభర్తలతోపాటు వారి నాలుగేళ్ల కుమార్తె కూడా ఉంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. అనంతరం వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులను నాందేడ్ వాసులుగా గుర్తించారు. వారంతా నాందేడ్ నుంచి హైదరాబాద్‌కు వెళుతుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఘోర ప్రమాదం - ముగ్గురు మృతి
8 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 21, 2026, 08:33 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)