- నామినేషన్లు ఉపసంహరింపచేయాలి
- టిడిపి నాయకులతో చంద్రబాబు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: స్తానిక సంస్థల ఎన్నికల్లో రెబల్ అభ్యర్ధులుగా పోటీ చేస్తే సస్పెన్షన్ వేటు తప్పదని టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం, జెడ్పిటిసి, ఎంపిటిసి అభ్యర్ధుల ఎంపికపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపిలు, అభ్యర్ధులు, బూత్ స్థాయి కార్యకర్తలతో బుధవారం ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.జనసేన, బిజెపి పోటీ చేస్తున్న చోట రెబల్స్‌గా పోటీ చేస్తున్న అభ్యర్ధుల నుంచి నామినేషన్లు ఉపసంహరింపచేయాలని ఆదేశించారు. కూటమి నేతలతో సమన్వయంగా వ్యవహరించాలని తెలిపారు. కూటమి పార్టీలతో మిత్రధర్మం పాటిస్తూ సీట్ల సర్దుబాటు సజావుగా జరిగేలా చూడాలని చెప్పారు.టికెట్లు దక్కని ఆశావాహులకు నామినేటేడ్ పదవుల్లో అవకాశం కల్పిస్తామని వెల్లడించారు. కూటమి అభ్యర్ధుల గెలుపే ధ్యేయంగా పనిచేయాలని చెప్పారు. కూటమి పార్టీల నుంచి మంచి అభ్యర్థులను ఎన్నుకుంటున్నామని, పార్టీ కోసం కష్టపడిన వారికి ప్రాధాన్యమిస్తున్నామని తెలిపారు. అభ్యర్థుల ఎంపిక మొదలుకుని ఫలితాల వరకు ప్రతి అంశాన్ని సీరియస్సుగా తీసుకోవాలని తెలిపారు.ఎన్నికల ప్రచారానికి వారం రోజుల సమయమే ఉందని, అన్ని మున్సిపాల్టీల్లో ప్రచారం చేపట్టాలని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ క్షేత్రస్థాయికి వెళ్లాలని, ప్రజల్లో ఉంటే మీకు తిరుగుండదని చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పును వైసిపి వక్రీకరిస్తోందన్నారు. మాజీముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్రిమినల్ లిటిగెంట్స్ అలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉంటే ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. ఏయే మున్సిపాల్టీల్లో ఏయే అభ్యర్థులను నియమించాలని తాము కసరత్తు చేస్తుంటే ఏయే ప్రాంతాల్లోకి ఏ రాష్ట్రం నుంచి గుండాలను దించాలో జగన్ కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. సర్‌పై నమ్మకం లేదన్నారని, మరోవైపు ఇదే సర్ జాబితా వచ్చే వరకు స్థానిక ఎన్నికలను జరపకూడని వైసిపి కోర్టుకు వెళ్తోందన్నారు. ఓటర్ జాబితా, బిసి రిజర్వేషన్లు ఇలా సుమారు 60 పిటిషన్లు హైకోర్టు, సుప్రీంకోర్టులలో వేశారని తెలిపారు.








కామెంట్లు (0)