ప్రజాశక్తి-చింతూరు : రంపచోడవరంలో నిర్వహించనున్న ఆదివాసి మహాగర్జన కార్యక్రమానికి బయలుదేరిన ఆదివాసీలను పోలీసులు అడ్డుకోవడంతో చింతూరు ఐటీడీఏ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారీ సంఖ్యలో చేరుకున్న ఆదివాసీలు నిరసన వ్యక్తం చేస్తూ రాస్తారోకో చేపట్టారు. దాదాపు గంటసేపు ఈ ఆందోళన కొనసాగడంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. అనంతరం జిల్లా ఎస్పీ హేమంత్ కుమార్, ఐటీడీఏ పీవో శుభం లోక్‌పాల్ ఆందోళనకారులతో చర్చలు జరిపారు. చర్చలు సానుకూలంగా ముగియడంతో రంపచోడవరంలో జరిగే ఆదివాసి మహాగర్జన బహిరంగ సభకు అధికారులు అనుమతి ఇచ్చారు. దీంతో ఆదివాసీలు తమ ఆందోళనను విరమించి మహాగర్జన కార్యక్రమానికి బయలుదేరారు.









కామెంట్‌లు (0)