- మున్సి పోల్స్కు ముందస్తు సన్నద్ధత
- పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దిశానిర్దేశం
ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి: మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సమాయత్తం కావాలని అధికారులను మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఆదేశించారు. సాధారణ పురపాలక ఎన్నికలపై సన్నాహక చర్యలలో భాగంగా గుంటూరులో ప్రాంతీయ సమాయత్త సమావేశం జరిగింది. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుంచి మున్సిపల్ కమిషనర్లు, రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, వివిధ శాఖల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ... త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని, నోటిఫికేషన్ కు ముందుగానే చేయాల్సిన పనులు త్వరగా చేయడం వల్ల ప్రక్రియ సులభతరమవుతుందన్నారు. పోలింగ్ కేంద్రాలను మున్సిపల్ కమిషనర్లు స్వయంగా తనిఖీ చేయాలని ఆదేశించారు. మున్సిపల్ పరిపాలన కమిషనర్ మరియు డైరెక్టర్ పి.సంపత్ కుమార్ మాట్లాడుతూ... మేయర్, మున్సిపల్ చైర్ పర్సన్ల ఎన్నికలు ప్రత్యక్షంగా జరగనున్నాయని, మార్పులను గమనిస్తూ ఎన్నికల నిర్వహణకు సిద్ధం కావాలన్నారు. గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కె.మయూర్ అశోక్, ఆర్జెడిలు రవీంద్ర బాబు, సూర్యదేవర హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.








కామెంట్లు (0)