ఆదివారం, 20 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

వాయుగుండం ముప్పు

1 గంట క్రితం

rains
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 20, 2026, 10:24 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఉత్తర అండమాన్‌, పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టరు ప్రఖర్‌ జైన్‌ తెలిపారు. ఈ అల్పపీడనం పశ్చిమ, వాయువ్య దిశగా కదులుతూ క్రమంగా బలపడే అవకాశం ఉందని శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సోమవారం తూర్పు మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా, మంగళవారం నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉందన్నారు. బుధవారం ఉదయానికి పశ్చిమ, వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాలకు సమీపంలోని పశ్చిమ మధ్య, దానిని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం ప్రాంతానికి చేరుకునే అవకాశముందని తెలిపారు. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్