ఆదివారం, 20 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రోడ్డు ప్రమాదంలో వైద్యుడు సజీవ దహనం

1 గంట క్రితం

car fire acidnet
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 20, 2026, 10:37 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • డివైడర్‌ను ఢీకొన్న కారు.. క్షణాల్లో చెలరేగిన మంటలు

సూర్యాపేట : హైదరాబాద్‌–ఖమ్మం జాతీయ రహదారిపై సూర్యాపేట సమీపంలోని పిల్లలమర్రి వద్ద ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఖమ్మం వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగిన కొద్ది నిమిషాల్లోనే కారు పూర్తిగా మంటల్లో చిక్కుకుంది. ఈ ఘటనలో కారులో ఉన్న వ్యక్తి సజీవ దహనమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడిని డా. కాసకుర్తి జగదీశ్‌గా గుర్తించారు. ఆయన ఖమ్మంలోని మమత ఆస్పత్రిలో న్యూరో సర్జన్‌గా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్