ఆదివారం, 20 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కరువును జాతీయ విపత్తుగా ప్రకటించాలి..

1 గంట క్రితం

22న జిల్లాలో సిపిఎం రాష్ట్ర బృందం పర్యటన
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 20, 2026, 11:23 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • 22న జిల్లాలో సిపిఎం రాష్ట్ర బృందం పర్యటన

  • సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ

ప్రజాశక్తి–విజయనగరం టౌన్‌: ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో, రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయని సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ అన్నారు. జిల్లాలోని 27 మండలాల్లో నెలకొన్న కరువు పరిస్థితులను జాతీయ విపత్తుగా ప్రకటించాలని ఆయన డిమాండ్‌ చేశారు. కరువు పరిస్థితులను పరిశీలించి, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు సిపిఎం రాష్ట్ర బృందం ఈ నెల 22న జిల్లాలో పర్యటించనుందని తెలిపారు. రాష్ట్ర నాయకులతో కూడిన బృందం తొలుత ఎస్‌.కోటకు చేరుకుంటుందని చెప్పారు. అనంతరం ఎస్‌.కోట, గంట్యాడ, గజపతినగరం, బొబ్బిలి ప్రాంతాల్లో పర్యటించి కరువు పరిస్థితులను పరిశీలిస్తుందని తెలిపారు. వర్షాలు లేక పంటలు నష్టపోయిన రైతులకు రుణమాఫీ చేయాలని డిమాండ్‌ చేశారు. ఆరుతడి పంటలను ప్రోత్సహించే విధంగా వ్యవసాయశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. పంటలు నష్టపోయి అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే ఆదుకోవాలని అన్నారు. ఉపాధి హామీ పనులను ముమ్మరం చేయాలని కోరారు. జిల్లాలోని 27 మండలాల్లో రైతాంగాన్ని సమీకరించి వారి సమస్యల పరిష్కారం కోసం ఉద్యమిస్తామని తమ్మినేని సూర్యనారాయణ తెలిపారు. సిపిఎం రాష్ట్ర బృందం పర్యటన సందర్భంగా రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని, తమకు జరిగిన పంట నష్టాన్ని బృందం దృష్టికి తీసుకురావాలని కోరారు. బృందం సేకరించిన సమాచారాన్ని ప్రభుత్వానికి నివేదిస్తామని చెప్పారు. పర్యటనను రైతులు విజయవంతం చేయాలని కోరారు. విలేకర్ల సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రెడ్డి శంకరరావు, టి.వి. రమణ, వి. లక్ష్మి పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్