మంగళవారం, 08 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

విద్యార్ధి భద్రతకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి

31 ఆగస్టు, 2026

ansari
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 31, 2026, 10:52 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ అన్సారియా

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పాఠశాలల్లో విద్యార్ధి భద్రత విషయంలో అన్ని శాఖలు విడివిడిగా కాకుండా సమన్వయంతో, సమిష్టిగా పనిచేయాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ ‌తమీమ్‌ ‌అన్సారియా అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి పాఠశాల భద్రత పర్యవేక్షణ కమిటీ (స్టేట్ లెవల్ టాస్క్ ఫోర్స్) సమావేశం సోమవారం విద్యాభవన్‌లో జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాఠశాల భద్రతను బలోపేతం చేసేందుకు క్షేత్రస్థాయి పరిస్థితులకు, మారుతున్న అవసరాలకు అనుగుణంగా సరళమైన, ఆచరణాత్మకమైన, డైనమిక్ వర్కింగ్ మోడల్ రూపొందించాలని చెప్పారు.ఈ మోడల్ ఉపాధ్యాయులు, పాఠశాలలపై అనవసరమైన అదనపు భారం పడకుండా, క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయగలిగేలా రూపొందించబడుతుందని తెలిపారు. పాఠశాల భద్రత నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు.

పాఠశాల భద్రతపై నిరంతర అప్రమత్తత, సమన్వయం అవసరమని ఆన్‌‌లైన్‌ ‌ద్వారా పాల్గొన్న సమగ్ర శిక్ష డైరెక్టర్‌ ‌బి శ్రీనివాసరావు అన్నారు. నిర్మాణంలో ఉన్న భవనాలు, పాత ప్రహరీలు, పాఠశాల పరిసరాల్లోని మౌలిక సదుపాయాలకు సంబంధించిన అంశాలపై ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత కీలకమన్నారు. పాఠశాల భద్రత అంటే మౌలిక సదుపాయాలకు మాత్రమే పరిమితం కాదని, రక్షణ, వేధింపులు, దుర్వినియోగం, అనుచిత ప్రవర్తన, సైబర్ భద్రత, మాదక ద్రవ్యాల పదార్థాల ప్రభావం, విద్యార్థుల రవాణా, వసతి గృహాల భద్రత వంటి అంశాలను కూడా సమగ్రంగా పరిష్కరించాల్సి ఉందన్నారు. సోషల్ ఆడిట్‌లు, క్షేత్రస్థాయి పరిశీలనల్లో వెలుగులోకి వస్తున్న సమస్యలను పరిగణించి, విద్యార్థులకు సురక్షితమైన వాతావరణాన్ని కల్పించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. విద్యార్థులు డిజిటల్ పరికరాల ద్వారా అనుచిత కంటెంట్‌కు గురికాకుండా సైబర్ భద్రతపై అవగాహన కల్పించడంతో పాటు, పొగాకు, మాదక వంటి హానికరమైన పదార్థాల ప్రభావం నుంచి విద్యార్థులను రక్షించేందుకు పాఠశాలలు, తల్లిదండ్రులు, సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. విద్యార్థుల రవాణాలో ఆటోలు, ప్రైవేట్ వాహనాలు భద్రతా ప్రమాణాలను పాటించేలా సంబంధిత శాఖలతో సమన్వయం అవసరమని చెప్పారు. ఈ కార్యక్రమం లో ప్లానింగ్ అడిషనల్ డైరెక్టర్ డి. మధుసూదన రావు, ఎస్సిఇఆర్‌‌టి డైరెక్టర్ ఎంవి, కృష్ణారెడ్డి, యునిసెఫ్ ఎడ్యుకేషన్ స్పెషలిస్ట్ శేషగిరి మధుసూదన్, సుదర్శన్, నోడల్ ఆఫీసర్ వాసిరెడ్డి విజయ దుర్గ తదితరులు పాల్గొన్నారు. ‘స్కూల్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ’ పుస్తకాన్ని అన్సారియా ఈ సందర్భంగా ఆవిష్కరించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్