గురువారం, 24 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

విమాన ప్రయాణాల్లో ఇవన్నీ సర్వసాధారణమే.. ఆందోళన చెందవద్దు

47 నిమిషాల క్రితం

kondapalli.jpeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 24, 2026, 08:58 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌

ప్రజాశక్తి–విజయనగరం కోట : విమాన ప్రయాణాల్లో వాతావరణ పరిస్థితుల కారణంగా విమానాలను దారి మళ్లించడం సర్వసాధారణమని, తన గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ తెలిపారు. బుధవారం రాత్రి భోగాపురంలో దిగాల్సిన ఎయిర్‌ ఇండియా విమానం వాతావరణ పరిస్థితుల దృష్ట్యా నాగ్‌పూర్‌కు వెళ్లిందని పేర్కొన్నారు. విమానం దారి మళ్లిన విషయం తెలియడంతో టీడీపీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు ఆందోళన చెందారని తెలిపారు. నాగ్‌పూర్‌ నుంచి బెంగళూరుకు, అక్కడి నుంచి మరో విమానంలో విజయవాడకు చేరుకున్నానని చెప్పారు. తనతోపాటు మంత్రి అచ్చెన్నాయుడు, మరో 70 మంది ప్రయాణికులు ఉన్నారని తెలిపారు. ప్రస్తుతం విజయవాడ క్యాంపు కార్యాలయంలో తాను సురక్షితంగా ఉన్నానని స్పష్టం చేశారు. ఎయిర్‌ ఇండియా విమానం మంత్రి అచ్చెన్నాయుడు, ఇతర ప్రయాణికులతో కలిసి భోగాపురం చేరుకుందని తెలిపారు. తన కోసం ఆందోళన చెందుతూ కుటుంబ సభ్యులకు, కార్యాలయ సిబ్బందికి ఫోన్‌ చేసి ఆరా తీసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు చెప్పారు. వారి అభిమానం, ఆప్యాయత తనకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చిందన్నారు. శుక్రవారం ఉదయం అమరావతిలో సమావేశాలు ఉన్నాయని, శుక్రవారం సాయంత్రానికి విజయనగరం వస్తానని మంత్రి తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్