విశాఖ జిల్లాలో 20 సెం.మీ.కుపైగా వర్షపాతం
ప్రజాశక్తి-అమరావతి : భారీ వర్షాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు ఆకస్మిక వరదల (ఫ్లాష్ ఫ్లడ్స్) ముప్పు ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏపీలో అనకాపల్లి, విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, పార్వతీపురం మన్యం జిల్లాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తెలంగాణలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు కూడా ఆకస్మిక వరదల హెచ్చరికలు జారీ అయ్యాయి. భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
భారత వాతావరణ శాఖ తాజా హెచ్చరికల ప్రకారం కోస్తా ఆంధ్రలో సెప్టెంబర్ 24న భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. బలమైన ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉందని IMD పేర్కొంది.
భారీ వర్షపాతం నమోదు
విశాఖపట్నం: 20 సెం.మీ.కుపైగా
కొత్తవలస, విజయనగరం: 18.8 సెం.మీ.
లక్ష్మీనరసుపేట, శ్రీకాకుళం: 15.8 సెం.మీ.
కాకినాడ రూరల్: 14.8 సెం.మీ.
ఫ్లాష్ ఫ్లడ్ ముప్పు ఉన్న జిల్లాలు
ఆంధ్రప్రదేశ్: అనకాపల్లి, విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, పార్వతీపురం మన్యం.
తెలంగాణ: ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం.
లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాగులు, వంకలు, కాలువలు దాటే ప్రయత్నం చేయవద్దని అధికారులు సూచించారు. వాతావరణ పరిస్థితులపై అధికారిక సమాచారాన్ని మాత్రమే అనుసరించాలని కోరారు.







కామెంట్‌లు (0)