బుధవారం, 22 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఅటామిక్ మినరల్స్ డైరెక్టరేట్‌‌కు 12 చదరపు కిలోమీటర్లు కేటాయింపు

2 గంటల క్రితం

atoms in the service of the nation
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 23, 2026, 12:15 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ గుర్తింపు కోసమే

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : అరుదైన ఖనిజాల (రేర్ ఎర్త్ ఎలిమెంట్స్) అన్వేషణ కోసం కేంద్రం పరిధిలోని అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్‌ప్లోరేషన్ అండ్ రీసెర్చ్ సంస్థ కు భూమిని కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పల్నాడు జిల్లాలో 12 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని ఐదేళ్లపాటు ఇచ్చేందుకు అనుమతినిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. పల్నాడు జిల్లాలోని పెట్లూరివారిపాలెం–కాకాని–అచ్చమ్మపాలెం పరిసర ప్రాంతంలో ఈ భూమిని కేటాయించారు. ఐదేళ్లపాటు ఇక్కడ అన్వేషణ తవ్వకాల కోసం అనుమతినిచ్చారు. ​అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్, అణుశక్తి శాఖ నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అటామిక్ మినరల్స్ కన్సెషన్ నిబంధనలు 2016 ప్రకారం ఈ ప్రాంతాన్ని అధికారికంగా నోటిఫై చేస్తున్నట్టు పేర్కొన్నారు. అంతకుముందు గనులు, భూగర్భ వనరులశాఖ నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందాయి. ఇప్పటికే దేశ వ్యాప్తంగా అరుదైన ఖనిజాల కోసం అన్వేషణ జరుగుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలోనూ అనేక ప్రాంతాల్లో అనుమతులిచ్చారు. ప్రధానంగా ఇటువంటి ఖనిజాలను ఎలక్ట్రిక్ వాహనాలు, విండ్ టర్బైన్లు, ఫోన్లు, కంప్యూటర్లు, సెమీకండక్టర్లు, రక్షణ రంగ పరికరాలు, అంతరిక్ష, అణుశక్తి పరిశ్రమలు వంటి వాటిల్లో ఎక్కువగా వినియోగిస్తారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్