- ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
ప్రజాశక్తి - విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా నిర్వహిస్తున్న అమరావతి పికిల్‌బాల్ లీగ్ (ఏఎంపిఎల్) ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విజయవాడలోని నైట్రో పికిల్‌బాల్ & కేఫే వేదికగా నేటి నుంచి ఈ నెల 9వ తేదీ వరకు ఈ లీగ్ పోటీలు జరగనున్నాయి. రాష్ట్రంలో పికిల్‌బాల్ క్రీడ అభివృద్ధికి ఈ లీగ్ ఒక కీలక మైలురాయిగా నిలుస్తుందని మంత్రి పేర్కొన్నారు. యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు, పికిల్‌బాల్ వంటి నూతన క్రీడలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విజయవాడ ఎమ్మెల్యే గద్దె రామోహన్నాయుడు, శాప్ చైర్మన్ రవి నాయుడు, సినీహీరో సుశాంత్, తదితరులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)