సోమవారం, 28 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionసోహ్రాబుద్దీన్ కేసుపై సుప్రీం ఆందోళన

1 గంట క్రితం

Supreme Court agrees to hear plea regarding Upper Bhadra project
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 28, 2026, 11:50 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • 92 మంది సాక్షులు ఫిరాయింపుపై విచారణ

  • అమిత్‌ షా విడుదలను పున: పరిశీలించమని స్పష్టీకరణ

న్యూఢిల్లీ : సోహ్రాబుద్దీన్‌ ఎన్‌‌కౌంటర్‌ ‌కేసులో ఏకంగా 92 మంది సాక్షులు ఫిరాయింపుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. సాక్షుల వాంగ్మూలాలను పరిశీలిస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ కేసులో నిర్దోషులుగా విడుదలైన వ్యక్తులకు నోటీసులు జారీ చేసింది.

సోహ్రాబుద్దీన్‌‌ది బూటకపు ఎన్‌కౌంటర్..

సోహ్రాబుద్దీన్ షేక్ ఎన్‌‌కౌంటర్‌‌కు వ్యతిరేకంగా అతని తమ్ముడైన రుబాబుద్దీన్ షేక్ దాఖలు చేసిన పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్ జయమాల్య బాఘ్చీ, జస్టిస్ వి. మోహనలతో కూడిన ధర్మాసనం ‌సోమవారం విచారించింది. ఇది ‘‘బూటకపు ఎన్‌కౌంటర్’’ పిటిషనర్‌దారుడు తెలిపారు. 22 మంది నిందితులను నిర్దోషులుగా విడుదల చేయడాన్ని ప్రశ్నించారు. ఈ పిటిషన్‌‌ విచారణ సందర్భంలో ‘‘92 మంది సాక్షులు ఫిరాయించడం తీవ్ర ఆందోళన కలిగించే విషయం. ఇది ఏకగ్రీవ నిర్ణయం అయినప్పటికీ, విచారణ నిష్పక్షపాతంగా, న్యాయబద్ధంగా జరిగిందా లేదా అనేది పరిగణించాల్సి ఉంది’’ అని జస్టిస్ బాగ్చి వ్యాఖ్యానించారు. ప్రధాన న్యాయమూర్తి కూడా ఇదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే, ఈ కేసులో కేంద్ర మంత్రి అమిత్ షాను నిర్ధోషిగా విడుదల చేయడాన్ని తాము పున: పరిశీలించమని ధర్మాసనం స్పష్టం చేసింది. అమిత్‌ ‌షా విడుదలకు వ్యతిరేకంగా గతంలో దాఖలైన పిటిషన్లను బాంబే హైకోర్టు, సుప్రీంకోర్టు ఇప్పటికే తిరస్కరించాయని గుర్తు చేసింది. ‘‘రాజకీయ ప్రత్యర్థుల ప్రోద్బలంతో, దురుద్దేశపూర్వక లక్ష్యంతో’’ ఈ పిటీషన్లు దాఖలైనట్లు కనిపిస్తోందని హైకోర్టు అభిప్రాయపడింది. బాంబే హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోమని సిజెఐ జస్టిస్‌ సూర్యకాంత్, న్యాయమూర్తి బాగ్చీ ఇద్దరూ స్పష్టం చేశారు. ఈ కేసు వివరాల ప్రకారం 2005లో హైదరాబాద్ నుండి మహారాష్ట్రకు బస్సులో ప్రయాణిస్తున్న షేక్ సోహ్రాబుద్దీన్ , అతని భార్య కౌసర్ బీ, అతని సహాయకుడు తులసిరామ్‌‌ ప్రజాపతిని ఒక పోలీసు బృందం అపహరించింది. దీనికి మూడు రోజుల తరువాత అహ్మదాబాద్ సమీపంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో సోహ్రాబుద్దీన్‌, అతని భార్య కూడా మరణించారు. 2006లో గుజరాత్-రాజస్థాన్ సరిహద్దులో జరిగిన మరో ఎన్‌కౌంటర్‌లో ప్రజాపతి మరణించారు. ఈ కేసుల్లో 21 మంది పోలీసులతో సహా 22 మంది నిందితులను బాంబే హైకోర్టు నిర్దోషులుగా విడుదల చేయడం గమనార్హం.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్