- రాష్ట్రం ఇండెంట్
- పాతికేళ్ళ చెల్లింపు పరిమితికి దరఖాస్తు
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : ఈ ఏడాది రెండో త్రైమాసికంలో మరోసారి భారీ రుణాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపించింది. జూలై నుంచి సెప్టెంబర్ వరకు కొనసాగే ఈ త్రైమసికంలో 19,800 కోట్లు తీసుకోవాలని రిజర్వ్ బ్యాంకుకు ప్రతిపాదనలు సమర్పించింది. జులై 1, 14, 28 తేదీలతో పాటు ఆగస్టు 11, 25 తేదీల్లో సెప్టెంబర్ 8, 22 తేదీల్లో ఈ రుణాలు తీసుకోనున్నారు. మొత్తం 7 విడతలుగా తీసుకునే ఈ రుణాల్లో అత్యధికంగా 25 సంవత్సరాల తిరిగి చెల్లింపు కాల పరిమితి రుణాలు కూడా ఉండడం విశేషం. మొత్తం మీద జులై ఒకటో తేదీన 2,600 కోట్లు, 14వ తేదీన 3,800 కోట్లు, 28వ తేదీన 2,600 కోట్లు రుణాలుగా సేకరించేందుకు ప్రతిపాదించగా ఆగస్టు 11న 2,800 కోట్లు, 25వ తేదీన 2,600 కోట్లు, సెప్టెంబర్ ఎనిమిదిన 2800 కోట్లు, అదే నెల 22వ తేదీన 2,600 కోట్లు రుణాలుగా స్వీకరించినందుకు ప్రతిపాదనలు పంపించారు. తొలి త్రైమాసికంలో 27 వేల కోట్ల రుణాలకు ప్రతిపాదనలు పంపించి ఇప్పటికే ఆ మొత్తాన్ని సేకరించడం తెలిసిందే.









కామెంట్‌లు (0)