బుధవారం, 26 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

వైసిపి ఎమ్మెల్సీ అనంతబాబుకు మరోసారి ఎదురుదెబ్బ

05 ఆగస్టు, 2026

Another setback for YCP MLC Anantha Babu.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 05, 2026, 04:57 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

రాజమండ్రి : వైసిపి ఎమ్మెల్సీ అనంతబాబుకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఆయన దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను రాజమహేంద్రవరం ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. నిందితుడికి నేరచరిత్ర ఉండటంతో బెయిల్‌ ఇవ్వొద్దని ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ముప్పాళ్ల సుబ్బారావు కోర్టులో వాదనలు వినిపించారు. ప్రత్యేక పిపి వాదనతో ఏకీభవించిన కోర్టు.. బెయిల్‌ పిటిషన్‌ను డిస్మిస్‌ చేసింది. అనంతబాబు ప్రస్తుతం రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు. ఇప్పటికే పలుమార్లు ఆయన బెయిల్‌ పిటిషన్లు తిరస్కరణకు గురయ్యాయి.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్