మంగళవారం, 18 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఅన్నీ మావల్లే వస్తున్నాయి

4 గంటల క్రితం

BJP (21)
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 18, 2026, 08:52 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమల రాకపై బిజెపి జాతీయ అధ్యక్షులు నితిన్‌ ‌నబిన్‌ గొప్పలు

ప్రజాశక్తి- గ్రేటర్‌ విశాఖ బ్యూరో : ఎపికి పెట్టుబడులు, పరిశ్రమలు తమ వల్లే వస్తున్నాయని బిజెపి జాతీయ అధ్యక్షులు నితిన్‌ ‌నబిన్‌ గొప్పలుపోయారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే ఎపికి రూ.15 లక్షల కోట్లు వచ్చాయన్నారు. దేశంలో అన్ని రాష్ర్టాల కంటే ఎపికి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అదనంగా 25 శాతం నిధులు ఇచ్చిందని పేర్కొన్నారు. విశాఖలోని వైజాగ్‌ కన్వెన్షన్‌ ‌సెంటర్‌‌లో మంగళవారం జరిగిన బిజెపి విస్తృత స్థాయి రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ విశాఖ ఉక్కును రక్షించుకోవడానికి రూ.11,414 కోట్లు, అమరావతికి రూ.15 వేల కోట్లు, గూగుల్‌ ‌డేటా సెంటర్లకు, అనకాపల్లి జిల్లాలో బల్క్‌ ‌డ్రగ్‌, గ్రీన్‌ ‌హైడ్రోజన్‌ ‌హబ్‌కు మరిన్ని నిధులు ఇచ్చామని తెలిపారు.

పోలవరం, రైల్వే జోన్‌ ‌విషయంలోనూ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తోందన్నారు. 370 ఆర్టికల్‌ ‌రద్దు, జాతీయ రహదారులు, విమానాశ్రయాలు, పోర్టుల అభివృద్ధి, ఆత్మనిర్బర భారత్‌ ‌వంటివాటిని ప్రచారాస్ర్తాలుగా వాడాలని సూచించారు. ఎపిలో కూటమి ప్రభుత్వం ఎన్నికల కోసం కాదని, రాష్ర్టాభివృద్ధి కోసమని పేర్కొన్నారు.

‘స్థానిక’ ఎన్నికలే లక్ష్యం : పివిఎన్‌.మాధవ్‌

ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్‌.మాధవ్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి సారించాలన్నారు. వార్డు, కార్పొరేషన్‌, జిల్లా స్థాయిల్లో పాగా వేసే లక్ష్యంతో పని చేయాలని కోరారు. ఈ నెల 22, 23 తేదీల్లో విజయవాడలో యువ మోర్చా సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ‘తాటిచెట్టు కల్పవృక్షం’ అనే కార్యక్రమాన్ని త్వరలో తీసుకుని రజకులు, నాయీబ్రాహ్మణులు, కల్లుగీత... ఇలా అందరినీ బిజెపి కలుపుకొని వెళ్లనుందన్నారు. సమావేశంలో బిజెపి నేతలు, కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాస్‌ ‌వర్మ, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌, ఎంపీలు దగ్గుబాటి పురంధరేశ్వరి, సిఎం రమేష్‌, మాజీ సిఎం నల్లారి కిరణ్‌ ‌కుమార్‌‌రెడ్డి, ఎమ్మెల్యే విష్ణుకుమార్‌‌రాజు తదితరులు పాల్గొన్నారు.

వికసిత్ భారత్ నిర్మాణంలో యువత కీలక పాత్ర

2047 నాటికి భారత్‌ను ప్రపంచంలో అగ్రగామి దేశంగా తీర్చిదిద్దడంలో యువత కీలక పాత్ర పోషించాలని నితిన్ నబిన్ కోరారు. విశాఖలోని గ్రాండ్ బే హోటల్‌లో నిర్వహించిన ‘జెన్ జీ–యువ సంవాద్’ కార్యక్రమంలో యువతతో ఆయన ముఖాముఖి సమావేశమై దేశ భవిష్యత్తు, అభివృద్ధి, వికసిత్ భారత్–2047 లక్ష్యాలపై చర్చించారు. మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా యువత తమ ఆలోచనా విధానాన్ని విస్తృతం చేసుకోవాలని, సాంకేతిక పరిజ్ఞానం, నూతన ఆవిష్కరణలు, నైపుణ్యాలను అందిపుచ్చుకోవాలని, ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా ఉద్యోగాలు సృష్టించే స్థాయికి ఎదగాలని సూచించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్