ఆదివారం, 06 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పుస్తక పఠనంతో లక్ష్యసాధన

1 గంట క్రితం

kakinada
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 06, 2026, 02:18 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-కాకినాడ : విద్యార్థులు జీవిత లక్ష్యాలను సాధించడానికి పుస్తక పఠనం ఎంతగానో దోహదపడుతుందని ఐడియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ కొక్కరమెట్ల సాయిబాబు అన్నారు. జాతీయ పుస్తక పఠన దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలోని కాకినాడ కులాయి చెరువు పార్క్ లో గల గాంధీ నగర్ శాఖా గ్రంధాలయంలో పుస్తక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సాయిబాబు విచ్చేసి పుస్తక ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు మేధో సంపన్నులు కావడానికి పుస్తక పఠనం ఎంతగానో దోహదపడుతుందన్నారు. విద్యార్థులకు నేషనల్ డిజిటల్ లైబ్రరీ గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ లైబ్రేరియన్ ములంపాక శ్రీనివాసరావు, గ్రంథాలయ పాఠకులు విద్యార్థులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్