శనివారం, 18 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

బెల్ట్ షాపుల రహిత రాష్ట్రంగా ఎపిని ప్రకటించాలి

2 గంటల క్రితం

kallu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 18, 2026, 10:32 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- ఎపి కల్లుగీత కార్మిక సంఘం డిమాండ్

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో లక్షలాది కల్లుగీత కుటుంబాల జీవితాలను సర్వనాశనం చేస్తోన్న లక్షకు పైగా ఉన్న బెల్టు షాపులను తొలగించి బెల్టు షాపుల రహిత ఆదర్శ రాష్ట్రంగా ఎపిని ప్రకటించాలని లేని పక్షంలో కూటమి ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఎపి కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వాక రామచంద్రరావు, జుత్తిగ నరసింహా మూర్తి హెచ్చరించారు. శనివారం మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రంలో సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం వాక రామచంద్రరావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి ముఖ్యమంత్రి ఎన్‌‌టి రామారావు కల్లును మినహాయించి, మద్య నిషేధం విధించి పది లక్షల గీత కార్మికుల గుండెల్లో నిలిచారన్నారు. సిఎం నియోజకవర్గంలో మద్యం డోర్ డెలివరీ చేస్తూంటే మద్యం ఎంత విచ్చలవిడిగా పారుతుందో తెలుస్తోందన్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం పర్యటనలో మంత్రి నారా లోకేష్ ను బెల్ట్ షాపులు తొలగించాలని జూన్ 24 న మహిళలు నిలదీశారన్నారు. రెండు సంవత్సరాల నుంచి ఆదరణ పథకం మూడు, ప్రవేశపెట్టి గీత కార్మికుల బతుకులు మారుస్తామని బిసి మంత్రి చేస్తున్న మోసపూరిత ప్ర కటనలు మానుకోవాలని హితవు పలికారు. రెండు సంవత్సరాల్లో గీత కార్మికుల సంక్షేమం గురించి మాట్లాడని ఎక్సైజ్ శాఖ మంత్రి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈనెల7న పందిరి మామిడిలో ఉన్న తాటి పరిశోధన ఉద్యాన కేంద్రాన్ని సందర్శించి గీత కార్మికుల ఓట్లు కోసం మోసపూరిత వాగ్దానాలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మరణించిన కుటుంబానికి రూ.పది లక్షలు, శాశ్వత వికలాంగులకు రూ.ఐదు లక్షలు, తాత్కాలిక వికలాంగులకు రూ.ఒకలక్ష చొప్పున ఎక్స్ గ్రేసియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అన్నీ జిల్లాల్లో నీరా కేఫ్‌‌లు, ఆదరణ పధకంలో మోటార్‌ ‌సైకిళ్లు గీతకార్మికులకు ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో నాయకులు బత్తెన నాగేశ్వరరావు, కామన మునిస్వామి, కడలి పాండు, కాగిత రాధాకృష్ణ, జుత్తిగ సంతోష్, రాడి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్