శనివారం, 18 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

'నీట్ లీక్‌'పై విద్యార్థి ఉద్యమానికి సిపిఎం సంఘీభావం

3 గంటల క్రితం

ma baby
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 19, 2026, 12:50 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- జంతర్‌మంతర్‌లో ఎంఎ.బేబీ ప్రసంగం

న్యూఢిల్లీ: 'నీట్ లీక్‌'పై పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన నిరాహార దీక్ష ను బలవంతంగా నిర్బంధించడాన్ని నిరసిస్తూ సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీ జంతర్‌మంతర్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఎఫ్‌ఐ) నిర్వహించిన 'క్రాంతి కార్నర్' కార్యక్రమంలో ఆయన విద్యార్థులు, యువతను ఉద్దేశించి ప్రసంగించారు. నీట్ పరీక్షల్లో జరిగిన అవకతవకలు, ప్రశ్నాపత్రాల లీకేజీలు దేశ విద్యా వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీశాయని పేర్కొన్నారు. విద్యార్థుల న్యాయమైన పోరాటానికి సిపిఎం పూర్తి సంఘీభావం ప్రకటిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, నీట్ ప్రశ్నాపత్రం లీక్‌కు జవాబుదారీతనం వహించాలని, దేశ విద్యా వ్యవస్థలో నెలకొన్న వైఫల్యాలకు బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ ప్రస్తుతం నిరాహార దీక్షలో ఉన్న ఎస్‌ఎఫ్‌ఐ అధ్యక్షుడు ఆదర్శ్ ఎం.సాజి, కాక్రోచ్ జనతా పార్టీ అధ్యక్షుడు అభిజీత్ దీప్కేతో పాటు ఉద్యమంలో పాల్గొంటున్న విద్యార్థులు, యువతకు ఎంఎ. బేబీ తన మద్దతు తెలిపారు. విద్యార్థుల సమస్యలను కేంద్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని, నీట్ వ్యవహారంపై పారదర్శక విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్