బుధవారం, 07 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionరాతపరీక్ష‍ ద్వారానే ఎపిఐఐసి నియామకాలు

1 గంట క్రితం

ap govt
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 07, 2026, 10:01 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • ఇక ఇంటర్వ్యూలు ఉండవ్‌

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి: ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (ఎపిఐఐసి)లో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా చేపట్టే ప్రత్యక్ష నియామకాల్లో ఇంటర్వ్యూలను తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇకపై ఆయా పోస్టుల భర్తీలో రాత పరీక్షే ఏకైక ఎంపిక విధానంగా అమలు చేయనుంది. ఎపిఐఐసిలో వివిధ కేడర్లలో 47 ఖాళీలను సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేసేందుకు ప్రభుత్వం గతంలో అనుమతినిచ్చింది. ప్రస్తుత ప్రభుత్వ విధానం ప్రకారం గ్రూప్–1 సర్వీసులకు మాత్రమే ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నామని, ఇతర పోస్టులకు రాత పరీక్ష ఆధారంగానే ఎంపిక జరుగుతుందని కమిషన్ స్పష్టం చేసింది. దీంతో ఎపిఐఐసి పోస్టుల నియామక ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు ఇంటర్వ్యూలను మినహాయించేలా స్టాఫ్ రెగ్యులేషన్స్‌ను సవరించేందుకు అనుమతినివ్వాలని ప్రభుత్వాన్ని ఎపిఐఐసి కోరింది. ఈ అంశాన్ని పరిశీలించిన ప్రభుత్వం 1974 చట్టంలో ఇందుకు సంబంధించిన క్లాజులను సవరించేందుకు అనుమతినిచ్చింది. ప్రత్యక్ష నియామకాల్లో ఇంటర్వ్యూలను మినహాయించి, కమిషన్ ద్వారా జరిగే నియామకాలకు రాత పరీక్షే ఏకైక ఎంపిక విధానంగా అనుసరించేలా నిబంధనలను సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్