మంగళవారం, 08 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

వీధి వ్యాపార ప్రణాళికకు ఆమోదం

24 ఆగస్టు, 2026

sa
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 24, 2026, 10:15 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- ఉత్తర్వులు విడుదల చేసిన ప్రభుత్వం

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : పురపాలక పరిపాలన పట్టణాభివృద్ధి శాఖ వీధి వ్యాపారులు (జీవనోపాధి రక్షణ వీధి వ్యాపార నియంత్రణ) చట్టం 2014 – లో సెక్షన్ 21(2) ప్రకారం 67 అర్బన్ లోకల్ బాడీలు సమర్పించిన ప్రణాళికలకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ఈ మేరకు పట్టణాభివృద్దిశాఖ ముఖ్య కార్యదర్శి సురేష్‌‌కుమార్‌ ‌సోమవారం జిఓ నెంబరు 202 విడుదల చేశారు. హైకోర్టు ఆదేశాలకు లోబడి వీటిని ఆమోదించినట్లు పేర్కొన్నారు. వీటి వ్యాపారులకు సంబంధించి ఏప్రిల్‌‌లో విడుదల చేసిన మొమో మెమో నెం.2833933/UBS/2025, జూన్‌‌లో విడుదల చేసిన మెమో నెం.3285088/UBS/2026 ఆధారంగా జులై నాలుగోతేదీన ప్రభుత్వం ఇచ్చిన జిఓ నెంబరు 140 ఆమలుకు ఆమోదముద్ర వేసినట్లు పేర్కొన్నారు. హైకోర్టు రిట్‌ ‌పిటీషన్‌ నెం.81, 103/2025 తదితర కేసుల్లో వీధి వ్యాపారుల రాష్ట్రవ్యాప్త సర్వే పూర్తయినట్లు నమోదు చేశారని, ఆ సర్వేల ఆధారంగా తీసుకున్న నిర్ణయాలను వీధి వ్యాపారులు (జీవనోపాధి రక్షణ మరియు వీధి వ్యాపార నియంత్రణ) చట్టం, 2014 నిబంధనల ప్రకారం నోటిఫై చేయాలని ఆదేశించిందని వివరించారు. ఈ నేపథ్యంలో సెక్షన్ 21క్రింద పేర్కొన్న అన్ని అంశాలను క్రోడీకరించి వీధి వ్యాపార ప్రణాళికల తయారీకి ఒక ప్రామాణికతను రూపొందించాలని నిర్ణయించినట్లు వివరించారు. దీన్ని పరిశీలించిన కంట్రీ ప్లానింగ్‌ ‌డైరెక్టర్‌ చట్టం‌లోని సెక్షన్ 21(2) కింద 51 అర్బన్ లోకల్ బాడీలు సమర్పించిన వీధి వ్యాపార ప్రణాళికలను ప్రభుత్వం ఆమోదించి నోటిఫై చేసిందని, ఇప్పటికే వీధివ్యాపార కేంద్రాలను గుర్తించిన నేపథ్యంలో వాటిని అమలు చేయాలని నిర్ణయించినట్లు జిఓలో తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్