ప్రజాశక్తి-గణపవరం (పశ్చిమ గోదావరి) : తనకి విద్య నేర్పించి ఉపాద్యాయునిగా సమాజంలో గౌరవం కల్పించిన తన గురువు అయిన అల్లూరిగంగరాజు చేతులమీదుగా సన్మానం చేయటం తన అదృష్టమని మండల ఉత్తమ ఉపాద్యాయ అవార్డు గ్రహిత జాలేంనాని అన్నారు. మంగళవారం స్తానిక పాఠశాలలో జాలేంనాని కి సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అల్లూరిగంగరాజు మాట్లాడుతూ .... తనవద్ద విద్య నేర్చుకుని ఈరోజు మండల ఉత్తమ ఉపాద్యాయునిగా అవార్డు పోందిన జాలేంనాని ని ఆయన అబినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాద్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.
గురువు నుండి సన్మానం పొందిన శిష్యుడు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 08, 2026, 12:47 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)