మంగళవారం, 10 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కౌంటింగ్ కేంద్రంలో అధికారుల మధ్య వాగ్వాదం

3 రోజుల క్రితం

82dba20f-f19a-41b1-81ef-570c4e57640d.jpeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 07, 2026, 12:27 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • సదుపాయాల లేమిపై ఆర్డీవో వర్సెస్ జెడ్పీ సీఈవో

  • కలెక్టర్ జోక్యంతో సద్దుమణిగిన వివాదం

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి : పరిషత్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద కనీస సదుపాయాలు లేకపోవడం అధికారుల మధ్య వివాదానికి దారితీసింది. కాకినాడ పీఆర్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రంలో తాగునీటి సదుపాయం కూడా లేకపోవడంతో ఎన్నికల ఏజెంట్లు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఏర్పాట్లలో నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏజెంట్లు గరంగరం కావడంతో పరిస్థితి చర్చనీయాంశంగా మారింది.ఈ క్రమంలో సదుపాయాల కల్పన అంశంపై కాకినాడ ఆర్డీవో ఎస్. మల్లిబాబు, జెడ్పీ సీఈవో లక్ష్మణరావు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇరువురి మధ్య కొద్దిసేపు వాదోపవాదాలు జరగడంతో కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ అక్కడికి చేరుకుని ఇరువురితో మాట్లాడి Lవివాదాన్ని సద్దుమణిగించారు. ఎన్నికల కౌంటింగ్ నిర్వహించే కేంద్రంలో కనీసం తాగునీటి సదుపాయం కూడా కల్పించకపోవడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్