మంగళవారం, 18 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionజిఒ 3పై హామీ అమలు చేయాలి

3 గంటల క్రితం

roundtable
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 18, 2026, 09:08 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • ఆదివాసీ గిరిజన సంఘం రౌండ్‌ టేబుల్‌ సమావేశం డిమాండ్

ప్రజాశక్తి– కురుపాం (పార్వతీపురం మన్యం జిల్లా) : జిఒ 3కు ప్రత్యామ్నాయ చట్టం తీసుకురావడంతోపాటు 1/70 చట్టాన్ని రక్షించాలని, గిరిజన గ్రామాలను ఐదో షెడ్యూల్‌లో చేర్చాలని ఆదివాసీ గిరిజన సంఘం రౌండ్‌ టేబుల్‌ సమావేశం డిమాండ్‌ ‌చేసింది. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో మంగళవారం జరిగిన ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎ.అశోక్‌ మాట్లాడుతూ జిఒ 3ను పునరుద్ధరిస్తామని గత అసెంబ్లీ ఎన్నికల ముందు కురుపాం బహిరంగ సభలో చంద్రబాబు ఇచ్చిన హామీ రెండేళ్లు గడుస్తున్నా అమలుకు చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. గిరిజనుల హక్కులను కాపాడేందుకు 1/70 చట్టంపై సుప్రీంకోర్టులో దాఖలైన కేసుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లీడ్‌ కావాలని కోరారు. సమస్యల పరిష్కారానికి ఈ నెల 27న కురుపాంలో నిర్వహిస్తున్న ర్యాలీ, బహిరంగ సభను గిరిజనులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కోరంగి సీతారాం అధ్యక్షతన వహించిన ఈ సమావేశంలో సంఘం జిల్లా గౌరవాధ్యక్షులు మండంగి రమణ, గిరిజన సమాఖ్య నాయకులు ప్రసాద్‌, లింగయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కొల్లి గంగునాయుడు, సిఐటియు జిల్లా కార్యదర్శి బివి రమణ, ఎన్‌.వై.నాయుడు, ఐద్వా జిల్లా కార్యదర్శి బి.లక్ష్మీ, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి బి.అనిల్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్