బుధవారం, 21 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

వైసీపీ అభ్యర్థుల ఇళ్లపై దాడి.. బైకు, లారీ దగ్ధం

1 గంట క్రితం

fire.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 21, 2026, 09:37 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • పులివెందులలో ఉద్రిక్తత..

ప్రజాశక్తి–పులివెందులటౌన్‌ : పులివెందుల పట్టణంలో మంగళవారం అర్ధరాత్రి వైసీపీ అభ్యర్థుల ఇళ్లపై దాడులు, వాహనాలకు నిప్పంటించడంతో ఉద్రిక్తత నెలకొంది. మున్సిపల్‌ ఎన్నికల్లో కౌన్సిలర్లుగా నామినేషన్లు దాఖలు చేసిన నిరంజన్‌రెడ్డి, అంజనప్ప ఇళ్లపై దాడులు జరిగినట్లు సమాచారం. నిరంజన్‌రెడ్డి ఇంటిపై బీరు సీసాలతో దాడి చేసి, ఇంటి ముందు ఉన్న లారీని దగ్ధం చేశారు. అంజనప్ప ఇంటి వద్ద స్కూటీకి నిప్పంటించారు. ఈ ఘటనలతో పట్టణంలో భయాందోళనలు నెలకొన్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గత 15 ఏళ్లుగా ప్రశాంతంగా ఉన్న పులివెందులలో మళ్లీ ఘర్షణ వాతావరణం ఏర్పడటంతో ప్రజలు బయటకు రావాలంటే భయపడే పరిస్థితి నెలకొందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్