ఆదివారం, 23 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

అమరావతిలో ఆస్ట్రేలియా ప్రతినిధుల బృందం పర్యటన

01 ఆగస్టు, 2026

po
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 01, 2026, 10:51 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - తుళ్లూరు (గుంటూరు జిల్లా): ఆస్ట్రేలియా ప్రభుత్వ అంతర్జాతీయ విద్య, పౌరసత్వం, కస్టమ్స్, బహుళ సాంస్కృతిక వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జూలియన్ హిల్ తమ ప్రతినిధి బృందంతో రాజధాని అమరావతిలో శనివారం పర్యటించారు. ఈ బృందానికి రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి టిజి భరత్, సిఆర్‌డిఎ కమిషనర్ వి విజయ రామరాజు, ఇతర ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. వీరు తొలుత రాయపూడిలోని సిఆర్‌డిఎ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. అమరావతి అభివృద్ధి ప్రణాళికలను, విద్యా రంగ పరస్పర సహకార అవకాశాలపై చర్చలు జరిపారు. అమరావతి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ఎఐసిసిసి)లో అభివృద్ధి పనులను కమిషనర్ వివరించారు. ప్రపంచ స్థాయి రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చేపడుతున్న విస్తృత చర్యలను సిఆర్‌‌డిఎ అడిషనల్ కమిషనర్ టి రాహుల్ కుమార్ రెడ్డి వివరించారు. భవిష్యత్‌లో క‌లిసి పని చేసేందుకు ఆసక్తితో ఉన్నామని ఈ సందర్బంగా ఆస్రేలియా బృందం తెలిపింది. ఆస్ట్రేలియా ప్రతినిధి బృందంలో సిలై జకీ, కన్సల్ జనరల్ కెమెరన్, డేమైన్ ఒలివర్, స్టీవెన్ బిడ్డేల్ ఉన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్