బుధవారం, 19 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆగస్టు 10 జైలు భరో జయప్రదం కోరుతూ బైక్ ర్యాలీ

08 ఆగస్టు, 2026

citu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 08, 2026, 05:59 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- అమెరికాతో జరిగే వ్యవసాయ స్వేచ్ఛ ఒప్పందాన్ని రద్దు చేయాలని నినాదాలు

ప్రజాశక్తి-కాకినాడ : కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆగస్టు 10 తలపెట్టిన జైలు భరో జయప్రదం చేయాలని కోరుతూ భానుగుడి సెంటర్ నుండి మెయిన్ రోడ్ దేవాలయం వీధి మీదుగా కలక్టరేట్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జాతీయ ఉపాధ్యక్షురాలు జి.బేబిరాణి, జిల్లా అధ్యక్షులు దువ్వ శేషాబాబ్జి, ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్, ఐఎన్టియుసి రాష్ట్ర చీఫ్ సెక్రెటరీ తాళ్లూరి రాజు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం ట్రాంప్ ఒత్తిడికి తలొగ్గి దేశీయ రైతాంగాన్ని దివాళా తీయించేందుకు అమెరికాతో స్వేచ్ఛ ఒప్పందం చేసుకోవడానికి సిద్ధమవుతోందని విమర్శించారు. ఈ ఒప్పందం అమలులోకి వస్తే వ్యవసాయ రంగంలో అమెరికా ఉత్పత్తులు జీరో టారీఫ్ వల్ల దేశీయ మార్కెట్లోకి ప్రవేశించి భారతదేశ రైతుల ఆదాయాన్ని దెబ్బతీస్తుందన్నారు. పాల ఉత్పత్తులను సైతం అమెరికా నుండి దిగుమతి చేసుకునేలా ఒప్పందానికి సిద్ధపడడం దూరదృష్టకరమన్నారు. తక్షణం అమెరికా స్వేచ్ఛ ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దేశీయ రైతులను కాపాడడం కోసం పంటలకు గిట్టుబాటు ధర చట్టాన్ని తక్షణం తీసుకురావాలని కోరారు. ఏ రంగంలో పనిచేసే కార్మికుడికైనా నేటి ధరలకు అనుగుణంగా కనీస వేతనం 31వేలు ఇచ్చేలా చట్టం చేయాలని, లేని పక్షంలో రైతుల, కార్మికుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని మోడీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమళ్ల పద్మ, మెడికల్ రిప్రజెంటేటివ్ యూనియన్ రాష్ట్ర కోశాధికారి దుంపల ప్రసాద్, నగర అధ్యక్ష కార్యదర్శులు స్వామి, వర్మ, సిఐటియు జిల్లా కోశాధికారి మలకా రమణ, జిల్లా వర్కింగ్ కమిటీ సభ్యులు మేడిశెట్టి వెంకటరమణ, పలివేల వీరబాబు, టి.రాజా, సూర్యనారాయణ, అనపర్తి ఏడుకొండలు, చెక్కల అమృత, వేణి, వేంకటలక్ష్మి, దీనదయ, సెక్యూరిటీ సంఘం నాయకులు ధర్మా, భాగ్యలక్ష్మి, శ్రీను, బాలరాజు, ఐఎన్టియుసి నాయకులు లోక్ పాల్, ఆర్వీ.రమణ, వి.శివ, ఎం.త్రిమూర్తులు, బి.అషాక్ కుమార్, ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటిపాక మధు, జిజిహెచ్ సెక్యూరిటీ గార్డ్ వర్కర్స్ యూనియన్ కె.వి.రామయ్య, కాటూరి రాజు, జాన్ బాబు, శివ, నాని, సురేష్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్