బుధవారం, 07 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఓట్‌చోర్‌ హఠావో.. దేశ్‌ బచావో..

1 గంట క్రితం

State Government Must Restore GO No. 3: V. Srinivasa Rao
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 08, 2026, 12:25 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • 10న చలో లోక్‌భవన్
    • అఖిలపక్ష పార్టీల వెల్లడి

  • బిజెపి బంటు జ్ఞానేష్‌కుమార్ రాజీనామా చేయాల్సిందే ​

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : బిజెపికి బంటుగా వ్యవహరిస్తూ 13 కోట్లకు పైగా ఓట్లను తొలగించిన కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ (సిఇసి) జ్ఞానేష్‌కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 10న ‘ఓట్‌చోర్‌ హఠావో.. దేశ్‌ బచావో’ నినాదంతో చలో లోక్‌భవన్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు అఖిలపక్ష పార్టీల నాయకులు వెల్లడించారు. బుధవారం బాలోత్సవ భవన్‌లో విలేకరుల సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఓట్ల చోరీపై రాష్ట్రంలోనూ ఉద్యమాన్ని ఉధృతం చేయనున్నట్లు తెలిపారు. ఓటు హక్కు పరిరక్ష‍ణ కోసం ఈ ఉద్యమంలో అన్ని పార్టీలూ, ప్రజా సంఘాలు, పౌరసంఘాలు కలిసి 10న చలో లోక్‌భవన్ కార్యక్రమం నిర్వహించను న్నామని తెలిపారు. దీనికి బిజెపి యేతర పార్టీలన్నిటినీ ఆహ్వానిస్తున్నామని, వైసిపి ఇప్పటికే కలిసి వస్తోందని, టిడిపిని కూడా ఆహ్వానిస్తున్నా మని పేర్కొన్నారు. ఓట్ల చోరీ వ్యవహారంలో జ్ఞానేష్‌కుమార్ కూరుకుపోయారని అన్నారు. ఫారం-6 మార్పు విషయంలో ఎన్నికల కమిషన్ తమను సంప్రదించలేదని, తాము ఎటువంటి మార్పులనూ ఆమోదించలేదని సుప్రీంకోర్టు చేసిన ప్రకటనతో అసలు విషయం బయటకొచ్చిందని తెలిపారు. ఇదే సమయంలో సిఇసి బిజెపి రాజకీయాల్లో ఉన్నారని కేరళం మాజీ చీఫ్ సెక్రటరీ చేసిన ప్రకటన అతను బిజెపితో అంటకాగే విషయాన్ని బయటపెట్టిందని అన్నారు. ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు తెలియకుండా అతను ఏమీ చేయలేడని, అయినావారు ఇప్పటికీ నోరెత్తడం లేదని విమర్శిం చారు. సిఇసికి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీల ఎంపిలందరూ ప్రదర్శన నిర్వహించి నిరసన వ్యక్తం చేసినా ఎన్నికల కమిషన్లోగానీ, ప్రభుత్వం లోగానీ కనీసం చలనం లేదని విమర్శించారు. జెన్‌జీ యువత ఆందోళన చేపట్టారని, జర్నలిస్టులపై ఆర్‌ఎస్‌ఎస్ ప్రోత్సాహక పోలీసులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, వారిపైనా ఎటువంటి చర్యలూ తీసుకోలేదని తెలిపారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రోద్బలంతోనే సిఇసి ఎన్నికల నియమ నిబంధనల ను తుంగలో తొక్కారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటువంటి వ్యక్తి ఒక్క క్షణం కూడా సిఇసిగా ఉండటానికి వీల్లేదని, 140 కోట్ల దేశ ప్రజలు అతన్ని ఏ మాత్రం అంగీకరించే పరిస్థితి లేదని అన్నారు. దేశ చర్రితలో ఇదొక చీకటి అధ్యాయమని విమర్శించారు.

సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డి శంకర్ మాట్లాడుతూ.. దేశ ప్రజాస్వామ్య హక్కును కాలరాశారని, 13 కోట్ల మందికి ఓటు హక్కు లేకుండా పోవడం అంటే మరణంతో సమానమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కొలనుకొండ శివాజీ మాట్లాడుతూ.. సిఇసి తీరుపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేదని అన్నారు. దీనిపై ప్రధాని, అమిత్‌షా నోరు విప్పాలని పేర్కొన్నారు. న్యూడెమోక్రసీ నాయకులు చిట్టిపాటి వెంకటేశ్వర్లు, ఎం రామకృష్ణ మాట్లాడుతూ.. పోలీసులు ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తల్లా మహిళల పట్ల నీచాతినీచంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఓటు హక్కు కోసం జరుగుతున్న ఆందోళనల్లో అందరూ కలిసి రావాలని కోరారు. ఎంసిపిఐయు నాయకులు ఖాదర్‌ బాషా మాట్లాడుతూ.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలన్నారు. ‌విలేకరుల సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్