హైదరాబాద్: శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బాంబు బెదిరింపు కలకలం రేపింది. అహ్మదాబాద్ నుంచి వచ్చిన ఇండిగో విమానంలో బాంబు ఉందంటూ ఓ విద్యార్థి చెప్పడంతో విమానాశ్రయ అధికారులు అప్రమత్తమయ్యారు. విమానం ల్యాండింగ్ అయిన అనంతరం ప్రయాణికులను కిందకు దించారు. అనంతరం విమానాన్ని ఐసోలేషన్ ప్రాంతానికి తరలించి, బాంబ్ స్క్వాడ్ సహాయంతో అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ విమానంలో హైదరాబాద్కు చెందిన 47 మంది విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. బాంబు బెదిరింపు నేపథ్యంలో భద్రతా సిబ్బంది అప్రమత్తమై తనిఖీలు కొనసాగిస్తున్నారు.
శంషాబాద్ ఎయిర్పోర్టులోని విమానానికి బాంబ్ బెదిరింపు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 17, 2026, 07:03 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు






కామెంట్లు (0)