- భువనేశ్వర్ కుమార్‌కు చోటు
- నేడు వెస్టిండీస్‌తో ఐదో, చివరి టి20
- రాత్రి 7.00గం.ల నుంచి
బెంగళూరు: టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సారథ్యానికే తొలిసారి పరీక్షను ఎదుర్కోనున్నాడు. ఆసియా క్రీడల్లో టీమిండియాకు స్వర్ణ పతకం సాధించడంలో కీలకపాత్ర పోషించిన శ్రేయస్.. స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగే టి20 సిరీస్‌ను చేజార్చుకోకుండా ఉండాలంటే శనివారం జరిగే ఐదో, చివరి టి20లో తప్పనిసరిగా గెలవాల్సి ఉంది. ఐదు టి20ల సిరీస్‌లో ఇరుజట్లు 2-2తో సమంగా ఉన్న దశలో చిన్నస్వామి స్టేడియంలో జరిగే చివరి టి20 ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక వెస్టిండీస్‌తో జరిగే ఐదో టి20కోసం భారత బృందంలో భువనేశ్వర్‌కు చోటు కల్పించారు. నాలుగో టి20లో అర్షదీప్ గాయపడడంతో.. అదనంగా భారత బృందంలోకి భువనేశ్వర్ వచ్చి చేరాడు. 36 ఏళ్ల భువీని అక్టోబర్ 22 నుంచి క్రైస్ట్‌చర్చ్‌లో కివీస్‌తో జరిగే టీ20 సిరీస్‌కు తొలుత ఎంపిక చేసిన విషయం తెలిసిందే.
చిన్నస్వామి పిచ్ బ్యాటర్లకు అనుకూలం. కానీ విండీస్ బ్యాటర్లను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. టి20 ఫార్మాట్లో వెస్టిండీస్ అత్యంత ప్రమాదకరమైన జట్టు. స్వదేశంలో ఆడుతున్నప్పటికీ టీమిండియాకు విండీస్‌ను ఓడించడం అంత సులువు కాదు. బ్యాటర్లకు స్వర్గధామమైన చిన్నస్వామి స్టేడియంలో భారత్ రికార్డు గొప్పగా ఏమీ లేదు. ఈ మైదానంలో ఇంతవరకు 8టి20లో జరగ్గా అందులో భారత్ కేవలం 4 మ్యాచుల్లో మాత్రమే గెలిచిం ది. మరో 3మ్యాచుల్లో ఓటమిపాలవ్వ గా.. ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు. విండీస్ కెప్టెన్ షాయ్ హోప్ విధ్వంసకర ఫామ్‌లో ఉన్నాడు. అతడ్ని పవర్ ప్లేలోనే పెవిలియన్ పంపితే టీమిండియాకు గెలుపు అవకాశాలు మెరుగవుతాయి.
తొలి మూడు వన్డేలకు శుభ్‌మన్, చివరి రెండింటికి శ్రేయస్ సారథ్యం: బిసిసిఐ
న్యూజిలాండ్‌కు పర్యటనకు వన్డే, టెస్టు జట్లను బిసిసిఐ సెలెక్షన్ కమిటీ శుక్రవారం ప్రకటించింది. ఈ పర్యటనలో భాగంగా జరిగే ఐదు టి20లకు జట్టును ఇప్పటికి ప్రకటించిన సెలెక్షన్ కమిటీ వన్డే సిరీస్‌కు ఇద్దరు కెప్టెన్లను ఎంపిక చేసింది. తొలి మూడు వన్డేలకు శుభ్‌మన్, ఆ తర్వాత రెండు వన్డేలకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అలాగే కివీస్‌తో జరిగే రెండు టెస్టులకు జట్టును వెల్లడించింది. ఆ రెండు టెస్టులకు గిల్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అక్టోబర్ 22 నుంచి టి20, నవంబర్ 4 వన్డే సిరీస్, నవంబర్ 19న తొలి టెస్టు, నవంబర్ 27న రెండో టెస్టు జరగనున్నాయి.
తొలి మూడు వన్డేలకు: శుభ్‌మన్(కెప్టెన్), రోహిత్, కోహ్లీ, శ్రేయస్, రాహుల్, నితీశ్ కుమార్, అక్షర్, నమన్ ధిర్, కాంబోజ్, గుర్నూర్ బ్రార్, గైక్వాడ్, అర్ష్‌దీప్ సింగ్, ఇషాన్ కిషన్, సిరాజ్, ప్రసిద్ధ్, కుల్దీప్.
4,5 వన్డేలకు: శ్రేయస్(కెప్టెన్), రోహిత్, కోహ్లీ, తిలక్, ఇషాన్, నితీశ్ కుమార్, అక్షర్, నమన్ ధిర్, అఖీబ్ నబీ, గుర్నూర్ బ్రార్, గైక్వాడ్, అర్ష్‌దీప్ సింగ్, కుశగ్రా, సిరాజ్, యశ్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్.
టెస్టు జట్టు: శుభ్‌మన్(కెప్టెన్), జైస్వాల్, కేఎల్ రాహుల్, పడిక్కల్, పంత్, జురెల్(వికెట్ కీపర్లు), జడేజా, కాంబోజ్, బుమ్రా, ప్రసిద్ధ్, ఆకాశ్ దీప్, సాయి సుదర్శన్, నితీశ్‌కుమార్, సుందర్, కుల్దీప్, సిరాజ్.







కామెంట్లు (0)