పలు చోట్ల పిడుగులు పడే అవకాశం...
ప్రజాశక్తి-అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో నేడు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దక్షిణ కోస్తా నుంచి వాయువ్య బంగాళాఖాతం వరకు ఏర్పడిన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలతో పాటు కాకినాడ, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఇతర ప్రాంతాల్లోనూ ఓ మోస్తరు వర్షాలు పడవచ్చని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.







కామెంట్లు (0)