ప్రజాశక్తి-విజయనగరం: చీపురుపల్లి నియోజకవర్గం గరివిడిలోని వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన కార్యకర్తల ఆత్మీయ కలయిక సమావేశం భావోద్వేగంగా సాగింది. జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు పార్టీ మారిన నేపథ్యంలో కార్యకర్తలు భావోద్వేగానికి గురయ్యారు. మజ్జి శ్రీనివాసరావుతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. మజ్జి పార్టీని వీడటంపై పలువురు కార్యకర్తలు విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సైతం భావోద్వేగానికి లోనయ్యారు. మజ్జి శ్రీనివాసరావుతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ మాట్లాడుతున్న సమయంలో ఒక్కసారిగా కంటతడి పెట్టుకున్నారు. బొత్సను చూసిన పలువురు కార్యకర్తలు కూడా కన్నీటి పర్యంతమయ్యారు. దీంతో సమావేశ ప్రాంగణంలో కొద్దిసేపు భావోద్వేగ వాతావరణం నెలకొంది. మజ్జి శ్రీనివాసరావు పార్టీ మారినప్పటికీ కార్యకర్తల మధ్య ఐక్యతను కొనసాగిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని నేతలు పిలుపునిచ్చారు.
వైసీపీ ఆత్మీయ కలయికలో బొత్స భావోద్వేగం.. కంటతడి
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 10, 2026, 01:27 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)