మహిళల జూనియర్ ఆసియా కప్ టోర్నీలో భారత హాకీ జట్టు సంచలన విజయం సాధించింది. పాకిస్తాన్‌ను ఏకంగా 19-0 గోల్స్ తేడాతో మట్టికరిపించింది. తద్వారా ఆసియా కప్ టోర్నీ సెమీ ఫైనల్‌కు దూసుకువెళ్లింది. చైనాలోని మోకీ వేదికగా గురువారం క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్- పాక్ జట్లు తలపడ్డాయి. పూజా సాహూ (7వ నిమిషం), రోషిణి ఐంద్ (9, 60+ నిమిషం), తనుశ్రీ దినేశ్ కదూ (11వ నిమిషం), సుఖ్‌వీర్ కౌర్ (13వ నిమిషం), సనికా చంద్రకాంత్ మనే (13, 23వ నిమిషం), మధూ సిదార్ (16, 39వ నిమిషం), గీతా యాదవ్ 18వ (నిమిషం), తనూజ తొప్పూ (25వ నిమిషం), పూజా మాలిక్ (27, 49, 51వ నిమిషం), పూర్ణిమా యాదవ్ (33వ నిమిషం), సుప్రియ (40, 54వ నిమిషం), క్రిష్ణ శర్మ (48వ నిమిషం), బినిమా ధన్ (55వ నిమిషం) లో గోల్స్ చేసి జట్టును గెలిపించారు. ఈ గెలుపుతో భారత మహిళా హాకీ జూనియర్ జట్టు ఆసియా కప్ సెమీ ఫైనల్లోకి దూసుకువెళ్లింది. ఇక గ్రూప్ దశలో భారత్ ఇప్పటికే జపాన్, మలేషియా, సౌత్ కొరియాలను ఓడించి టాపర్‌గా నిలిచింది.
Women’s Hockey Asia Cup: పాకిస్తాన్‌పై భారత్ ఘన విజయం
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 10, 2026, 01:16 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)