గురువారం, 10 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ: వైఎస్‌ జగన్‌

1 గంట క్రితం

Government schools are empty... Where are the 5.56 lakh students? : YS Jagan
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 10, 2026, 01:04 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి: 2025 మెగా డీఎస్సీ పేరుతో ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేస్తోందని వైసిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోపించారు. గురువారం తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జగన్ మాట్లాడారు. డీఎస్సీలో అక్రమాలు తవ్వేకొద్దీ బయటపడుతున్నాయని, వాటిపై ప్రశ్నించిన వారిని జైల్లో పెడుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆయన విమర్శించారు. డీఎస్సీ వ్యవహారంపై తాము ప్రభుత్వానికి అనేక ప్రశ్నలు సంధించినప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌ ఎందుకు సమాధానం చెప్పడం లేదని జగన్‌ ప్రశ్నించారు. డీఎస్సీ ప్రశ్నపత్రాల తయారీ, పర్యవేక్షణ బాధ్యతలను ఒకే వ్యక్తి చేతిలో ఎందుకు పెట్టారని నిలదీశారు. అలాగే జీవో నంబర్లు 4, 47లను ఎందుకు తీసుకొచ్చారని, నియామక ప్రక్రియ పూర్తయిన తర్వాత వాటిని ఎందుకు మార్చాల్సి వచ్చిందని ప్రశ్నించారు. డీఎస్సీలో పరీక్షే నిర్వహించకుండా 372 స్పోర్ట్స్‌ కోటా పోస్టులను ఎలా భర్తీ చేశారని ఆయన నిలదీశారు. జీవో నంబర్లు 4, 47తో గేట్లు తెరిచి, పని పూర్తయ్యాక జీవో నంబర్లు 23, 25, 56తో గేట్లు మూశారని జగన్‌ ఆరోపించారు. డీఎస్సీ వ్యవహారంలో అక్రమాలు వెలుగులోకి వస్తున్న కొద్దీ చంద్రబాబులో ఆందోళన, బీపీ పెరుగుతోందని వ్యాఖ్యానించారు. డీఎస్సీ-2025లో జరిగినట్లు ఆరోపిస్తున్న అన్ని అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి, నిరుద్యోగులు, అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్