ప్రజాశక్తి–విశాఖ కలెక్టరేట్: విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ సమీపంలోని బీచ్ ప్రాంతంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బీచ్‌లో మృతదేహం పడి ఉండటాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కాం గ్రామానికి చెందిన మైలపల్లి చంటి (35) విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో చేపల వేట సాగిస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. భార్య, పిల్లలతో కలిసి పెయిన్ దొరపేటలో నివాసం ఉంటున్నాడు. ఆదివారం తనను కొందరు వ్యక్తులు చంపేస్తామని బెదిరిస్తున్న విషయాన్ని చంటి తన సోదరితో చెప్పినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఫిషింగ్ హార్బర్ సమీపంలోని బీచ్‌లో చంటి మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. తలపై కర్రతో కొట్టిన ఆనవాళ్లతో పాటు మెడ చుట్టూ నైలాన్ తాడు బిగించినట్లు గుర్తించినట్లు తెలిపారు. దీంతో ఇది హత్యగా అనుమానిస్తున్నారు. మృతుడి సోదరి అప్పలకొండ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హత్యకు గల కారణాలు, నిందితుల వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ మార్చురీకి తరలించారు.
విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో దారుణ హత్య
4 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 07, 2026, 12:05 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)