నేడు చలో కలెక్టరేట్ కు తరలి రానున్న ఉద్యోగులు
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : మేము ఉద్యోగం చేస్తాం తప్ప ఊడిగం చేయమంటూ సచివాలయ ఉద్యోగులు పోరుబాట పట్టారు. పదోన్నతులు లేవు, వేతనాలు పెరుగుదల లేదు, ఏడేళ్ల అవుతున్న ఇంకా రికార్డు అసిస్టెంట్ కేడర్లోనే ఉద్యోగాలు దీంతో సచివాలయ ఉద్యోగులు వారి సమస్యలు పరిష్కారం కోసం పోరుబాట పట్టారు. గత మూడు రోజులుగా విశాఖ కేంద్రంగా నిరహార దీక్షలు చేపట్టి, ప్రభుత్వం పట్టించుకోకోవడంతో పెద్ద ఎత్తున రోడ్డుపై ఆరు జిల్లాలు నుంచి వెళ్లిన ఉద్యోగులు బైటాయించి నినదించారు. దీంతో ఉద్యమాన్ని మరింత ఉదృతం చేయడంలో భాగంగా నేడు విజయనగరం జిల్లాలో చలో కలెక్టరేట్ నిర్వహించి వేలాదిగా తరలి రానున్నారు.
సచివాలయ ఉద్యోగులు 2019 అక్టోబర్ 2 లో మొదటి బ్యాచ్ 1,10,000 మంది నియామకం, 2020 లో రెండో బ్యాచ్, 21000 మంది నియామకం జరిగాయి.,1,31,0000 మంది, జిల్లాలో గ్రామ, మున్సిపాలిటీల్లో 626 సచివాలయాల్లో 5556 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ప్రోహిభిషన్ కాలం రెండు ఏళ్లు,జీతం 15,000 ఇవ్వడం జరిగింది. రెండు సంవత్సరాలు రెగ్యులర్ చేసి,పి స్కేల్ అమలు చేయాలి. అయితే మొదటి బ్యాచ్ కి 9 నెలలు ఆలస్యముగా రెగ్యులర్ చేశారు, 9 నెలలు ఏరియర్ అమౌంట్ ప్రభుత్వం ఇవ్వకపోవడం వలన ఆ డబ్బులకు నష్టపోయారు. రెండో బ్యాచ్ 5 నెలలు రెగ్యులర్ చేయడం వలన వేరు 5 నెలలు ఏరియర్ పోయింది. పే స్కేల్ ఫిక్స్ చేసినప్పుడు కూడా పిజీలు,ఎం టెక్ లు చేసినా రికార్డు అసిస్టెంట్ పే స్కేల్ ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు కూడా వేతనాలలో అన్యాయం జరిగింది. రెగ్యులర్ అయినపుడు ప్రోహిబిషన్ పీరియడ్ యొక్క రెండేళ్ల కాలానికి పూర్తి అయిందకు గాను రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలి ఆది కూడా ఇవ్వలేదు. ఆరేళ్లు ఉద్యోగం పొందినప్పటికీ నేటికి పదోన్నతులు కల్పించలేదు. సర్వీస్ రూల్స్,జాబ్ చార్ట్ కూడా ప్రాపర్గా ఇవ్వలేదు. పదోన్నతులు లేని కారణంగా ఆరేళ్లుగా రికార్డు అసిస్టెంట్ కేడర్ లో పని చేయాల్సి వస్తుంది. పదోన్నతులు ఇవ్వకుండా వాలంటీర్లను తీసేసి వారు చేసిన పని కూడా వీరి చేత ,సర్వేలు, పెన్షన్లు పంపిణీ, శాఖ పరమైన పనులు చేయించడం కోసం జీఓ 11 ను తీసుకొచ్చి బానిసలుగా పని చేయిస్తున్నారని ఉద్యోగులూ ఆందోళ వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు రేషనలైజేషన్ , డిప్యూటీషన్ తీసుకొచ్చి ఉద్యోగుల సంఖ్యను తగ్గించారు. టార్గెట్, ర్యాంకింగ్ వ్యవస్థలను తీసుకొచ్చి నలుగురు చేయాల్సిన పనిని ఒకరితో చేయిస్తూ, ఒత్తిడి తీసుకొస్తున్నారు.దీంతో సుమారుగా ఆరేళ్లలో 600 మంది రాష్ట్రంలో చనిపోగా, కూటమి ప్రభుత్వం వచ్చిన రెండేళ్లలో సుమారుగా 200 మంది కి పైగా గుండి పోటు, బ్రెయిన్ స్ట్రోక్, ప్రమాదాల బారిన పడి చనిపోవడం జరిగింది. విజయనగరం జిల్లాలో 10 మంది వరకు చనిపోవడం జరిగింది. పని చేసేవారు ఒక్కడు, పని చెప్పే వాళ్ళు పది మంది కావడం వలన, పనిని పర్యవేక్షించడానికి త్రీ టైర్ వ్యవస్థను తీసుకొనీ రావడం వలన పని ఒత్తిడి విపరీతంగా పెరిగింది. ఏ ప్రభుత్వ శాఖలో లేని మరణాలు సచివాలయ వ్యస్థల్లో రావడం ,చిన్న వయస్సులో చనిపోతున్నారనీ ఆందోళన ఉద్యోగుల్లో వ్యక్తమవుతుంది. కనీసం ప్రభుత్వాలు చనిపోవడానికి కారణాలు కూడా అడగడం లేదని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం ఏ పథకం తీసుకొచ్చినా కింద స్థాయి వరకు తీసుకెళ్తున్న ఉద్యోగులు సచివాలయ ఉద్యోగులు. ప్రజలకు నిరంతరం సేవలు అందిస్తూ మమేకం అవుతున్నారు. కోవిడ్ సమయంలో అందరూ ఇళ్లలో ఉంటే, సచివాయల సిబ్బంది మాత్రం ప్రతి ఇంటికి వెళ్ళి కొవిడ్ పరీక్షలు చేయడం,మందులు పంపిణీ చేయడం సేవలు అందించి చివరకు కోవిడ్ లో కొంతమంది సచివాలయ ఉద్యోగులు చనిపోవడం జరిగింది. విజయవాడ బుడమేరు వరద ప్రమాదం జరిగినప్పుడు సచివాలయ ఉద్యోగులు చేసిన సేవలను ముఖ్యమంత్రి సచివాలయ ఉద్యోగులను మెచ్చుకోవడం జరిగింది. దీంతో ఎటువంటి విపత్తు వచ్చినా ఫీల్డులో ఉండి ప్రజలను అప్రమత్తం చేస్తూ ఉద్యోగులు ప్రాణాలు అర్పించిన ఘటనలు ఉన్నాయి. విమానాశ్రయం ప్రారంభానికి, యోగేంద్ర వంటి కార్యక్రమాలు విజయవంతం చేయడంలో సచివాలయ ఉద్యోగులు పాత్ర మరువలేనిది. ఎన్ని టాస్క్ లు వచ్చినా వాటిని చేదిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇటువంటి సేవలు అందిస్తున్న ఉద్యోగులు సమస్యలు పరిష్కారం చేసుకోవడం వలన ఉద్యోగుల్లో ఆందోళన ఆవేదన వ్యక్తమవుతుంది. ఇటువంటి పరిస్థితిలో సమస్యకు సాధన కోసం సచివాలయ ఉద్యోగులు పోరుబాట పట్టారు. అందులో భాగంగా మంగళవారం చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లాలో ఉన్న సచివాలయ ఉద్యోగులు అధిక సంఖ్యలో కదిలిరానున్నారు.
డిమాండ్లు .....
అడ్వాన్స్డ్ ఎడ్వాన్స్మెంట్ స్కీమ్ కింద ఇవ్వాల్సిన 2 నోషనల్ ఇంక్రిమెంట్లు వెంటనే మంజూరు చేయాలి.
ఏ ఏ ఎస్ తక్షణమే అమలు చేయాలి.
ప్రొబేషన్ ఆలస్యమైన 9 నెలల కాలానికి ఎరియర్స్ వెంటనే మంజూరు చేయాలి.
ప్రొబేషన్ ఆలస్యమైన కాలానికి 1 వార్షిక ఇంక్రిమెంట్ మంజూరు చేయాలి.
ఏం ఎస్ ప్రతి ఉద్యోగికి కనీస మూలవేతనం రూ. 30,000/-తగ్గకుండా ప్రమోషన్ ఛానల్ కల్పించాలి..
జీఓ 11 ను వెంటనే రద్దు చేయాలి.
మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు రావాలసిన అన్ని ప్రయోజనాలు 3 నెలల లోపు అందించి కుటుంబంలో ఒక్కరికి కారుణ్య నియామక ప్రక్రియ పూర్తిచేయాలి.
జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో స్వర్ణ వార్డు, స్వర్ణ గ్రామం ఉద్యోగ సంఘాలకు ప్రాతినిద్యం కల్పించాలి.







కామెంట్‌లు (0)