ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ -2026 లో పల్నాడు జిల్లా పోలీసు శాఖకు చెందిన ఆర్‌ఐ (అడ్మిన్) సాదినేని కృష్ణ టెన్నిస్ డబుల్స్ విభాగంలో కాంస్య పతకం సాధించారు. ఈ నెల 1 నుంచి 4 వ తేదీ వరకు అమరావతిలో జరిగిన రాష్ట్ర స్థాయి పోలీస్ క్రీడల్లో పాల్గొన్న ఆయన ప్రతిభ కనబరిచారు. టెన్నిస్ డబుల్స్‌లో పతకం సాధించి జిల్లా పోలీసు శాఖకు మంచి పేరు తీసుకువచ్చిన ఆర్‌ఐ కృష్ణను జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) రోహిత్ కుమార్ చౌదరి సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో అభినందించారు. క్రీడల్లో అద్భుత ప్రతిభ కనబరిచారని ప్రశంసించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
టెన్నిస్ డబుల్స్‌లో ఆర్‌ఐ కృష్ణకు కాంస్య పతకం
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 07, 2026, 03:33 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)